E-Paper
Advertisement

Naa Anveshana Arrest : 2025లో ఐబొమ్మ రవి… 2026లో నా అన్వేషణ

Naa Anveshana Arrest : 2025లో ఐబొమ్మ రవి… 2026లో నా అన్వేషణ
Advertisement

Naa Anveshana Arrest : 2025లో క్రైమ్ రేట్ పెరిగిందా… తగ్గిందా అనేది పక్కన పెడితే.. ఓ అరెస్ట్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం మాట్లాడుకున్నాయి. కొంత మంది ఆ అరెస్ట్‌ను సమర్థిస్తే.. చాలా వరకు.. అతనికి సపొర్ట్‌గా నిలిచారు. అంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన అరెస్ట్ ఎవరిది అంటే… ఐబొమ్మ రవి.

ఐబొమ్మ, బప్పం టీవీ అనే వెబ్ సైట్స్‌తో సినిమాలను పైరసీ చేస్తున్నాడని, ఆయా సైట్స్‌లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి… ఎంతో మంది చావుకు కారణం అవుతున్నాడు అంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. 2026లో మళ్లీ అలాంటి ఓ అరెస్ట్ ఉండబోతుంది అని అంటున్నారు నెటిజన్లు.

Advertisement

ఆ అరెస్ట్ ఎవరిది అంటే… ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ. ఎప్పుడూ విదేశాల్లో ఉంటూ… వీడియోలు పెట్టే అన్వేష్ కొన్ని సార్లు వివాదాస్పదమైన కామెంట్స్ కూడా చేస్తాడు. గతంలో కాంట్రవర్సీ వీడియోలు అన్వేష్ నుంచి చాలా వచ్చాయి. ఇప్పుడు రీసెంట్‌గా శివాజీ చేసిన కామెంట్స్‌పై రెస్పాండ్ అవుతూ… శివాజీని, గరికపాటిని బూతులు తిడుతూ… ద్రౌపది, సీతాదేవిపై కూడా కామెంట్స్ చేశాడు.

ఆ వీడియో కాస్త ఫుల్ వైరల్ అయింది. హిందీ సంఘాలు ఫైర్ అయ్యాయి. కరాటే కళ్యాణి లాంటి వాళ్లు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్వేష్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేసి.. దేశ ద్రోహిగా ప్రకటించాలి అంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ సందర్భంలో 2025లో అరెస్ట్ చేసిన ఐబొమ్మ రవి గురించి ప్రస్తావన వస్తుంది.

Advertisement

అన్వేష్‌‌లానే… ఐబొమ్మ రవి కూడా విదేశాల్లో ఉంటాడు. చిక్కడు దొరకడు. కానీ, తెలంగాణ పోలీసులు పకడ్భందీగా ప్లాన్ వేసి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చాలా కేసులో నమోదు అయిన ఉన్న ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌ను పోలీసులు అలానే అరెస్ట్ చేయాలనే డిమాండ్ వస్తుంది.

అలా అరెస్ట్ చేస్తే… ఇప్పుడు ఐబొమ్మ రవికి వస్తున్న సపోర్ట్ లానే.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కి కూడా రావొచ్చు. ఎందుకంటే… అన్వేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకున్నాడు. తర్వాత ఆ వ్యాఖ్యలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోలు కూడా పెట్టాడు. దీని తర్వాత అన్వేష్‌పై కొంత మంది అభిప్రాయం మారిపోయింది. దీనివల్ల అన్వేష్‌ అరెస్ట్ తర్వాత ఐబొమ్మ రవికి వచ్చినట్టే సపొర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి… 2026లో యూట్యూబర్ అన్వేష్‌ను అరెస్ట్ చేస్తారా..? లేదా.. ఎప్పటిలానే.. అన్వేష్ విదేశాల్లోనే ఉండిపోతాడా అని.

Also Read : నా అన్వేషణను దేశద్రోహిగా ప్రకటించాలి.. పోలీసులకు ఫిర్యాదులు..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×