E-Paper
Advertisement

Naa Anveshana : నా అన్వేషణను దేశద్రోహిగా ప్రకటించాలి.. పోలీసులకు ఫిర్యాదులు..

Naa Anveshana : నా అన్వేషణను దేశద్రోహిగా ప్రకటించాలి.. పోలీసులకు ఫిర్యాదులు..
Advertisement

Naa Anveshana : సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతూ పలువురు సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెట్టారు. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ శివాజీ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. శివాజీ మాటలు నీ తప్పు పడుతూనే హిందూ దేవుళ్ళపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. అతని వీడియో పై రియాక్ట్ అయిన హిందూసంఘాల సభ్యులు కేసు నమోదు చేశారు. ఇది కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఆయనపై కేసులు నమోదు చేస్తున్నారు… ఇప్పటివరకు యూట్యూబర్ అన్వేష్ పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో ఒక్కసారి మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం..

నా అన్వేష్ పై కరాటే కళ్యాణ్ పోలీస్ కంప్లైంట్…

మహిళల డ్రెస్సింగ్ పై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ అన్వేష్ రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియోని రిలీజ్ చేశారు.. మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడే అధికారం ఎవరికి లేదు అంటూ దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.. ఆ వీడియో పై నెటిజన్లతో పాటుగా హిందూ సంఘ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో నా అన్వేష్ పై పోలీస్ కేసును నమోదు చేశారు. ఆ తర్వాత మరొక కేసు కూడా ఆయన పై నమోదయింది.. తాజాగా సినీనటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నా అన్వేష్ పై కంప్లైంట్ ఇచ్చింది. 352,79,299 BNS SEC 67IT ACT నమోదు అయ్యింది. ఆమె ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు త్వరలోనే అతనికి నోటీసులు పంపించమన్నారని సమాచారం.. ఇప్పటికే హిందూ సంఘాల సభ్యులు అతన్ని దేశ ద్రోహిగా చిత్రీకరించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.. ఇప్పుడు ఈ కేసు కూడా నమోదు అవ్వడంతో అన్వేష్ కు వ్యతిరేకత పెరుగుతుంది..

Advertisement

Also Read : స్త్రీలను హింసించే వాళ్లు దుర్మార్గులు… త్రివిక్రమ్ పై  మళ్లీ రెచ్చిపోయిన పూనమ్..

నా అన్వేష్ పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయి..?

శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సందర్భంగా యూట్యూబర్ అన్వేష్ దేవతలను దూషించారు. అతని పై సీరియస్ అయిన హిందు సంఘాలు పోలీస్ కేసు నమోదు చేశారు.. సినీ నటి కరాటే కళ్యాణి కూడా అన్వేష్ పై కేసులు పెట్టింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అన్వేష్‌పై కేసు నమోదైంది.. ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు..అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయా? మతపరమైన, మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.. ప్రస్తుతం దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు కీలక అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు స్టేషన్లలో అన్వేష్ పై కేసులు నమోదవడంతో తెలుగు రాష్ట్రాల పోలీసులు అన్వేష్ కు నోటీసులు పంపనన్నారని తెలుస్తుంది.. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అతనికి వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని పోలీసులను జనాలు డిమాండ్ చేస్తున్నారు.. పోలీసులు అతన్ని ఎలా అరెస్ట్ చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×