E-Paper
Advertisement

Warangal Airport: మామునూరు ఎయిర్‌పోర్ట్‌.. రెండు నెలల్లో శంకుస్థాపన, ఆ రెండింటిపై చర్చలు

Warangal Airport: మామునూరు ఎయిర్‌పోర్ట్‌.. రెండు నెలల్లో శంకుస్థాపన, ఆ రెండింటిపై చర్చలు
Advertisement

Warangal Airport: తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించానికి వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. మరో రెండు నెలల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇదే కాకుండా ఉత్తర తెలంగాణ  ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పనులపై ఫోకస్ చేసింది ప్రభుత్వం.

మామునూరు ఎయిర్‌పోర్ట్‌.. రెండు నెలల్లో శంకుస్థాపన

Advertisement

తెలంగాణలో కొత్తగా ఎయిర్‌‌పోర్టులపై ఫోకస్ చేసింది రేవంత్‌రెడ్డి. దీనికి సంబంధించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఆపై పర్యవేక్షణ చేస్తోంది. ఇక వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రెండు నెలల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూమి పూజ మొదలుపెట్టాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి 953 ఎకరాల భూమి సేకరించి కేంద్రానికి అప్పగించినట్టు తెలుస్తోంది.

శనివారం సచివాలయంలో కొత్త ఎయిర్‌పోర్టుల గురించి కీలక సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏవియేషన్ డైరెక్టర్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులతో ఆయన వివిధ అంశాలపై చర్చించారు. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి.

Advertisement

ఆదిలాబాద్- కొత్తగూడెం ఎయిర్‌పోర్టు పనులపై ఆరా

వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. సాంకేతిక అనుమతులు పూర్తి చేసి త్వరగా శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అటు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టును రక్షణ శాఖ-పౌర విమానయాన శాఖ-రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి.

దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌ సిద్ధం చేయాలని అధికారులను కోరారు. భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుందని ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు అధికారులకు తెలిపారు.  ఇక భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు సంబంధించి గతంలో ప్రతిపాదించిన భూమి అనుకూలంగా లేదని తెలిపింది పౌర విమానయాన శాఖ.

ALSO READ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం, జూన్ 2 నుంచి అమలు!

తాజాగా ఎయిర్ పోర్టు అధికారుల భేటీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు మంత్రి పొంగులేటి. ఆ ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణంపై లోతైన అధ్యయనం చేయాలన్నారు. సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై కేంద్రంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ, మౌలిక వసతుల ఏర్పాట్ల విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు.

 

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×