Ashwagandha: ఆయుర్వేదంలో మూలికల రాజుగా పేరొందిన అశ్వగంధ వాడకంపై నిషేధం విధించింది కేంద్రప్రభుత్వం. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్‌లో అశ్వగంధ ఆకులను వినియోగంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు నుంచి తీసిన రసాన్ని వినియోగించాలని ప్రస్తావించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉన్నట్లుండి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణాలు ఏంటి?
అశ్వగంధ వినియోగం.. కేంద్రం నిషేధం
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI ఏప్రిల్ 16న ఆదేశాలు జారీ చేసింది. అశ్వగంధ ఆకులు కలిపిన ఉత్పత్తులను తయారుచేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. మార్కెట్‌లో దానికి సంబంధించి ఉత్పత్తులను వెంటనే వెనక్కి తీసుకోవాలని తయారీదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 కింద కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పింది.
అశ్వగంధ ఆకుల్లో విథాపెరిన్-A పేరిట రసాయనం ఉండటం ప్రధాన కారణం. పరిమితికి మించి తీసుకుంటే కాలేయానికి హాని కలిగించవచ్చు. ఈ విషయం పలు అధ్యయనాల్లో తేలింది. కొన్నాళ్లు కిందట ఐస్‌లాండ్, జర్మనీ, భారత్‌లో నిర్వహించిన పరిశోధనల్లో అశ్వగంధం వినియోగం వల్ల చాలామంది కాలేయం దెబ్బతిన్నట్లు తేలిందట. ఈ క్రమంలో కేసులు కూడా నమోదయ్యాయి.
హెల్త్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు.. ఆకులకు బదులు వేర్లు ఉపయోగించవచ్చు
అశ్వగంధం వేర్లతో పోలిస్తే ఆకుల ధర చాలా తక్కువ. కొన్నికంపెనీలు లాభాల కోసం వేర్లకు బదులు ఆకులు వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆయుర్వేద గ్రంథాలు వాటి వేర్లను వినియోగించాలని సూచిస్తున్నాయి. ఆకులను బయటి పూతగా వాడాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో అశ్వగంధ ఉత్పత్తులు కొనేటప్పుడు ప్యాకేజీపై అశ్వగంధ రూట్ ఎక్స్‌ట్రాక్ట్ లేకుంటే అశ్వగంధ వేరుతో చేసినంది స్పష్టంగా ఉందో లేదో చూసుకోవాలని చెబుతున్నారు. అశ్వగంధ ఎక్స్‌ట్రాక్ట్ ఉంటే ఆకులు ఉండే అవకాశముందని చెబుతున్నారు. 2026లో అశ్వగంధ మార్కెట్ విలువ 928.5 మిలియన్ డాలర్లుగా ఓ అంచనా. ఈ రంగం విలువ సుమారు 38.77 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఓ అంచనా.
ALSO READ: మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అయితే గ్రీన్ ఫ్లాగ్స్, రెడ్ ఫ్లాగ్స్ గురించి తెలుసా?.. ఇలా గుర్తించండి
2033 నాటికి 84.99 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఓ అంచనా. ఉత్తర అమెరికా, ఐరోపాలో అశ్వగంధకు వివరీతంగా గిరాకీ ఉంది. అక్కడ గమ్మీలు, క్యాప్సూల్స్, టీ మిశ్రమాలు, ఫోర్టిఫైడ్ పానీయాల రూపంలో విక్రయిస్తున్నారట. దేశంలో పురుషులలో బలం, లైంగిక ఆరోగ్యం కోసం సహజ బూస్టర్‌గా ఉపయోగిస్తున్నారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అశ్వగంధను సాగు చేస్తున్నారు. దీని విస్తీర్ణం సుమారు 10,780 హెక్టార్లుగా ఉందని ఓ అంచనా. అశ్వగంధ ఉత్పత్తులు అందించే ప్రధాన కంపెనీల్లో హిమాలయా వెల్నెస్, డాబర్ ఇండియా, పతంజలి ఆయుర్వేద్, బైద్యనాథ్, జండు వంటి కంపెనీలున్నాయి.