E-Paper
Advertisement

ఆది సాయి కుమార్‌తో హాస్య మూవీస్ 10వ సినిమా.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

ఆది సాయి కుమార్‌తో హాస్య మూవీస్ 10వ సినిమా.. రేపే గ్రాండ్ ఓపెనింగ్
Advertisement

Hasya Movies: ‘హాస్య మూవీస్’ (Hasya Movies) …ప్రామిసింగ్ ప్రాజెక్ట్ లని ఖాతాలో వేసుకుంటున్న ఈ ప్రొడక్షన్ హౌస్ పేరిపుడు టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది.మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని వరుస సక్సెస్ లతో ప్రూవ్ చేస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్ తాజాగా తన 10వ సినిమాని మొదలెట్టేస్తుంది.రాజేష్ దండా నిర్మాతగా తెరకెక్కబోతున్న ఈ ‘ప్రొడక్షన్ నంబర్ 10’ రేపు ఉదయం (ఏప్రిల్ 3) 10 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

ప్యూర్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ టార్గెట్

Advertisement

“లవ్ ఈజ్ బ్లూమింగ్.. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అంటూ మేకర్స్ వదిలిన పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.గులాబీ పువ్వులు, రొమాంటిక్ వైబ్‌తో ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే, హాస్య మూవీస్ ఈసారి ఒక ప్యూర్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.ఇక టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా, కథలో దమ్ముంటే చిన్న సినిమానైనా పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లగలరని ఇప్పటికే k ర్యాంప్ తో ప్రూవ్ చేసుకున్నారు కూడా.ఇక ఆ నమ్మకమే ఇప్పుడు ఈ 10వ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

also read:టాలీవుడ్‌లో బిగ్ ట్విస్ట్…అద్దెల్లేవు.. ఇక అంతా వాటాలే!

Advertisement

శంబాల వంటి సాలిడ్ హిట్ అందుకున్న ఆది సాయి కుమార్ హీరోగా

ఇక ఇప్పటికే ‘ఊరు పేరు భైరవకోన’, ‘సామజవరగమన’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అంటూ డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ బ్యానర్ లో ల్యాండ్‌మార్క్ మూవీగా రాబోతున్న ఈ 10వ ప్రాజెక్ట్ లో శంబాల వంటి సాలిడ్ హిట్ అందుకున్న ఆది సాయి కుమార్ హీరోగా, రొమాంటిక్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమాకి  ఫణి కుమార్ డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.

మరిన్ని  క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో

ఇక ప్రస్తుతం యోగి కేవైసీ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్న ‘ ది బ్లాక్ గోల్డ్’ చిత్రం సెట్స్ పై ఉండగా ఇందులో సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే .ఇక ఇవే కాకుండా హాస్య మూవీస్‌లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయని ఇన్ సైడ్ టాక్ .మొత్తానికి ఎన్నో ప్రొడక్షన్ హౌస్ లు హిట్టు కోసం చక్కర్లు కొడుతుంటే హాస్య మూవీస్ ఇలా దూసుకెళ్తుoదన్న మాట !

also read:అమ్మ నమ్మకం వర్సెస్ నాస్తికుడి ప్రేమ! అంత్యక్రియల రచ్చపై ప్రకాష్ రాజ్ ‘విశ్వరూపం’.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×