E-Paper
Advertisement

టాలీవుడ్‌లో బిగ్ ట్విస్ట్…అద్దెల్లేవు.. ఇక అంతా వాటాలే!

టాలీవుడ్‌లో బిగ్ ట్విస్ట్…అద్దెల్లేవు.. ఇక అంతా వాటాలే!
Advertisement

Theatre Revenue: ఇప్పటిదాకా ఒకలెక్క ఇప్పటినుండి ఒకలెక్క అంటున్నారు థియేటర్ల ఓనర్స్.అవును …ఇన్ని రోజులుగా ఉన్న రెంటల్’ (అద్దె) గొడవలకు చెక్ పెడుతూ సరికొత్త పాలసీని అమల్లోకి తెస్తున్నారు.ఇకనుండి రెంట్ వసూల్ చేసే పాత పద్దతికి టాటా చెప్పేసి మల్టీప్లెక్స్‌ల తరహాలో ‘పర్సంటేజీ’ (వాటా) విధానంలోకి మారబోతున్నారు.ఒక రకంగా ఇది హిస్టారికల్ డిసీషన్ అనే చెప్పాలి.ఇక ఈ ఏప్రిల్ 3 నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి రానుండటంతో టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ఈ న్యూస్ పెద్ద డిబెటబుల్ అయిపొయింది.

థియేటర్ల మెయింటెనెన్స్ చేయడం తలకి మించిన భారం

Advertisement

నగరంలోని 23 ప్రధాన సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయని తెలుస్తుంది. థియేటర్ల మెయింటెనెన్స్ చేయడం తలకి మించిన భారంగా ఉందని, ఇంకా అలాగే పాత పద్దతుల్లో థియేటర్ లని నడపడం కష్టమని అందుకే నిర్ణయం తీసుకున్నారు . ఇక ఇదే విషయం పై ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ ”ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, కానీ మెయింటెనెన్స్ భారం పెరిగిపోయింది. అందుకే మల్టీప్లెక్స్ మోడల్‌లోకి మారుతున్నాం” అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ చేసింది కూడా .

also read:ఏసీ కొంటున్నారా? ఆఫర్లు చూసి మోసపోకండి..

Advertisement

మెజారిటీ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్

ఇక ఈ పర్సంటేజీ విధానం ప్రకారం చూస్తె సినిమా రిజల్ట్‌ను బట్టి తొలి వారం 60 శాతం వాటా,రెండో వారం50 శాతం వాటా,మూడో వారం 40 శాతం వాటా ప్రకారం ఎగ్జిబిటర్లకు రెవెన్యూ షేర్ దక్కుతుంది.ఇక ఇది వారందరికీ లభాసాటిగా ఉండటంతో మెజారిటీ అగ్ర శ్రేణి డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే, శశిధర్ రెడ్డి మాత్రం నిర్మాతలు మరియు ఇతర భాగస్వాములతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం చెబుతామని పేర్కొనడం గమనార్హం.

లాభం జరుగుతుందా లేక నష్టం వస్తుందా?

అయితే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చిన్న సినిమాలకు లాభం జరుగుతుందా లేక నష్టం వస్తుందా? అన్నది ఇప్పుడు కాస్త ఆసక్తిగా మారింది.సినిమా బ్లాక్ బస్టర్ అయితే థియేటర్ల యజమానులకు భారీగా లాభాలు వచ్చే అవకాశం పుష్కలం.అదే సినిమా సరిగ్గా ఆడకపోతే మాత్రం అటు ఫిక్స్‌డ్ రెంట్ రాదు ఇటు వాటా రాదు కాబట్టి ఎగ్జిబిటర్లు నష్టపోయే ప్రమాదం కూడా ఎక్కువే అన్న టాక్ వినిపిస్తుంది.ఇక ప్రస్తుతానికి 23 థియేటర్లతో మొదలైన ఈ విధానం, త్వరలోనే తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్‌లకు వర్తించనుందని తెలుస్తుంది.

అద్దె భారం నుంచి డిస్ట్రిబ్యూటర్లకు రిలీఫ్

ఏది ఏమైనా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న ఈ డిసీషన్ టాలీవుడ్ బిజినెస్‌లో పెద్ద మార్పులే తీసుకొచ్చేలా కనిపిస్తుంది.మరి అద్దె భారం నుంచి డిస్ట్రిబ్యూటర్లకు రిలీఫ్  లభిస్తుందా? లేక వాటాల గొడవలు మొదలవుతాయా? అన్నది చూడాలి. మొత్తానికి ఏప్రిల్ 3 నుంచి థియేటర్ల కౌంటర్ల దగ్గర లెక్కలు మారబోతున్నాయన్న మాట !

also read:భార్యాభర్తల మధ్య ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×