Comrade Kalyan Teaser:కింగ్ ఆఫ్ ఎంటర్ టైనర్ గా పేరు కొట్టేసిన శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే చాలు ఆడియెన్స్ లో ఒక రకమైన క్యూరియాసిటీ కనిపిస్తుంది.ఎన్ని సినిమాలు వచ్చినా తనదైన వినోదంతో, డిఫరెంట్ కాన్సెప్టులతో థియేటర్లకు జనాన్ని రప్పించడంలో ఈ హీరో రూటే సెపరేటు.
‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’, ‘స్వాగ్’ వంటి వరుస క్రేజీ ఫిలిమ్స్ తో సత్తా చాటిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు మరో సరికొత్త ఎంటర్ టైనింగ్ ఫిలిమ్ తో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయిపోయాడు .అదే ‘కామ్రేడ్ కళ్యాణ్’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
1992 కాలం నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని మాడుగుల అనే ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ స్టోరీతో వస్తుంది ఈ సినిమా.ఇందులో సీరియస్ కాన్సెప్ట్ ఉంటూనే శ్రీవిష్ణు మార్కు కామెడీ ని మిక్స్ చేసిన తీరు అందరినీ ఫిదా చేస్తోంది.
‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే నక్సలైట్ నాయకుడి కోసం పోలీసులు, ప్రత్యేక గ్రేహౌండ్స్ దళాలు జల్లెడ పడుతున్న నేపథ్యంలో కథ నడుస్తుందని టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది.ఒకవైపు ఉత్కంఠ రేపే పోలీసుల వేట, మరోవైపు ఆ సీరియస్ వాతావరణంలో శ్రీవిష్ణు ఇచ్చే వన్-లైనర్లు, నవ్వులు పూయించే నటన టీజర్‌కు మెయిన్ ఎసెట్ .
దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఈ కథను తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా అనిపిస్తోంది. స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ ఈ సినిమాని సమర్పిస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి .
ఇందులో శ్రీవిష్ణుకి జోడీగా మహిమా నంబియార్ నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్స్ రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకోలు అత్యంత కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్లో చూపించిన ప్రొడక్షన్ వాల్యూస్, విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత ఊపునిచ్చాయనడం లో సందేహం లేదు.
శ్రీవిష్ణు కెరీర్ చూస్తుంటే ఒకప్పటి ‘అల్లరి నరేష్’లాంటి కామెడీ టైమింగ్‌ను ఫాలో అయిపోతూ ప్రామిసింగ్ హీరో అయిపోయాడు. అందుకే అక్టోబర్ 9, 2026న రాబోతున్న ఈ దసరా కానుకపై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
దసరా పండుగ సీజన్ అంటేనే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడతారన్నా సంగతి తెల్సిందే ., సరిగ్గా అదే సమయానికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర స్లైడ్ సౌండ్ చేయడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు మేకర్స్.
Also read :పారడైస్ స్టోరీ ఇదేనా ? ఇదే ఐతే కష్టమే మరి !
చూడాలి పీరియడ్ డ్రామా, యాక్షన్, కామెడీ ని బ్లెండ్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేస్తుందో తెలియాలంటే అక్టోబర్ 9 వరకు ఆగాల్సిందే!