E-Paper
Advertisement

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్
Advertisement

Science Fiction psychological Horror: ఒక మనిషి అనుకోకుండా ఓ వింత ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ మనం ఎప్పుడూ చూసే గదులే ఉంటాయి… కానీ వాటికి అంతం ఉండదు. బయటకు వెళ్లే దారి కనిపించదు. చుట్టూ ఎవరూ ఉండరు. పైగా మనిషి భయాలు, జ్ఞాపకాలు, మానసిక గాయాలే అక్కడ ప్రమాదకరమైన రూపాల్లో ఎదురైతే ? అసలు ఆ ప్రపంచం నుంచి బయటపడటం సాధ్యమేనా ? ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన ‘బ్యాక్‌రూమ్స్’ (Backrooms) ఇదే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన సైకలాజికల్ హారర్ సినిమా. ఇప్పుడు తెలుగులో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ హర్రర్ మూవీని తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1990ల కాలంలో జరుగుతుంది. క్లార్క్ అనే ఫర్నిచర్ స్టోర్ యజమాని వ్యక్తిగత జీవితంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంటాడు. భార్యతో సంబంధాలు దెబ్బతినడం, మానసికంగా కుంగిపోవడం అతన్ని డిప్రెషన్‌ లోకి నెట్టేస్తాయి. ఇదే సమయంలో తన స్టోర్ బేస్‌మెంట్‌ లో క్లార్క్‌ కు ఓ వింతైన రహస్య ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం సాధారణ తలుపు కాదు. దాని వెనుక పూర్తిగా భిన్నమైన ప్రపంచం ఉంటుంది. పసుపు రంగు గోడలు, నిరంతరం శబ్దం చేసే ఫ్లోరోసెంట్ లైట్లు, ఎక్కడ చూసినా ఒకేలా కనిపించే ఖాళీ గదులు… బయటకు వెళ్లే మార్గం మాత్రం కనిపించదు. అదే ‘ది బ్యాక్‌రూమ్స్’.

Advertisement

ఆ ప్రపంచంపై ఆసక్తి పెరిగిన క్లార్క్, దాని నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి గదులను మ్యాపింగ్ చేయడం మొదలు పెడతాడు. కానీ కొద్దికొద్దిగా అతని వాస్తవ ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. బయట ఉన్నవాళ్లకు అతను కనిపించకుండా పోతాడు. క్లార్క్‌ కు చికిత్స అందిస్తున్న డాక్టర్ మేరీ క్లైన్ అతని ఆచూకీ కోసం వెతుకుతూ చివరకు అదే బేస్‌మెంట్‌ లోకి అడుగు పెడుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు కూడా ఆ అంతులేని గదుల భయంకరమైన ప్రపంచం ఎదురవుతుంది.

కానీ అక్కడి ప్రమాదం కేవలం దారి తప్పిపోవడం కాదు. బ్యాక్‌రూమ్స్‌ లో చిక్కుకున్న వ్యక్తుల భయాలు, జ్ఞాపకాలు, గతంలోని గాయాలు వింతైన జీవుల రూపంలో వారికి ఎదురవుతుంటాయి. అంటే బయటకు రావాలంటే ఆ ప్రపంచం నుంచి మాత్రమే కాదు… తమలోని భయాల నుంచి కూడా తప్పించుకోవాలి. మేరీ చివరకు క్లార్క్‌ ను గుర్తించిందా ? అప్పటికే మానసికంగా పూర్తిగా కుంగిపోయిన అతన్ని తిరిగి తీసుకురాగలిగిందా ? ఆ అంతులేని గదుల నుంచి ఇద్దరూ బయట పడగలిగారా ? లేక బ్యాక్‌రూమ్స్‌ వారినీ శాశ్వతంగా తనలోనే బంధించిందా ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలైన కథ.

తెలుగులోనూ చూడొచ్చు

Advertisement

‘బ్యాక్‌రూమ్స్’ (Backrooms)ను A24 నిర్మించింది. క్రీపీపాస్టా అర్బన్ లెజెండ్స్, కేన్ పార్సన్స్ రూపొందించిన వైరల్ యూట్యూబ్ సిరీస్‌ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చెవెటెల్ ఎజియోఫోర్, రెనేట్ రైన్స్‌వే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సైకలాజికల్ హారర్ చిత్రం ప్రస్తుతం ‘సోనీ లివ్’ (Sony LIV)లో స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఇది ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ అందుబాటులో ఉంది. సాధారణ హారర్ కంటే భిన్నంగా లిమినల్ స్పేసెస్, సైకలాజికల్ ఫియర్, మిస్టరీ కలిసిన సినిమా మంచి హర్రర్ థ్రిల్ ఇస్తుంది.

Read Also:

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

Tags

Related News

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×