Aditi Siddharth Home:సిద్ధార్థ , అదితి రావు హైదరి.. 2021 లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహాసముద్రం సినిమాలో కలిసి నటించిన ఇద్దరు 2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా వీరిద్దరూ చెన్నైలో సొంతం చేసుకున్న కలల ఇల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత ఇద్దరు మొదటిసారిగా చెన్నైలో కొనుగోలు చేసిన ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ఇన్సైడ్ పిక్చర్స్ ని ఆర్కిటెక్చర్ డైజెస్ట్ ఇండియా తాజాగా బయట పెట్టడంతో షాక్ అవుతున్నారు నెటిజన్లు.
ఇంట్లోని ప్రతి మూల, ప్రతి గది, ప్రతి వస్తువు ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించి ఉండటంతో ఇప్పుడు ఈ ఇల్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది .ఇక ఈ జోడి కలల ఇంటి విషయానికి వస్తే ఇది దాదాపు 4000 చదరపు అడుగుల వైశాల్యంతో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక 18వ అంతస్తులో ఉన్న వీరి లగ్జరీ ప్లాట్ నుంచి చూస్తే చెన్నై మహానగరం తో పాటు సముద్ర తీరం కూడా కళ్ళముందే కనిపిస్తుందట.ఇక ఈ ఇంటిని ప్రముఖ ఆర్కిటెక్ట్ శ్రుతి సి రెడ్డి డిజైన్ చేయగా ఈ ఇంటిలోని ఇంటీరియర్ మొత్తాన్ని పవిత్ర రాజారాం డిజైన్ చేసినట్టు తెలుస్తుంది . ఇక ఇంట్లో గోడలకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక విజిబులిటీ లేఅవుట్ డిజైన్ ని ప్లాన్ చేసినట్టు చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఇదే వీరి ఫేవరెట్ ప్లేస్ కూడా .
లివింగ్ రూమ్ విషయానికి వస్తే కళకళలాడే పెద్ద ఫ్రెంచ్ విండోస్ కి ప్రశాంతమైన లినైన్ కర్టెన్ లని ఏర్పాటు చేయడం విశేషం .అంతేకాకుండా రంగురంగుల దిండ్లు, రాయల్ ప్రింట్లు ఉన్న సోఫాలతో గ్రాండియర్ లుక్ తీసుకొచ్చారు కూడా.తాహెరాలీస్ గ్లాస్ షాండేలియర్,గ్లాస్ కాఫీ టేబుల్, విక్కర్ హ్యాండ్ ఛైర్, హ్యాండ్-నాటెడ్ మంచాహా కార్పెట్, పింక్ గ్లాస్ ఆర్ట్ మరియు సిల్క్ జామ్‌దానీ కుషన్లు వంటివి వాటితో ప్లాట్ కి ప్రత్యేకమైన క్లాసీ మరియు లగ్జరీ లుక్ ను తీసుకొచ్చారు డిజైనర్స్ .ఇక ఇంటి ఎంట్రెన్స్ విషయానికి వాటి ప్యాసేజ్ ఏరియాలో ఒక ఒక ఆర్ట్ మ్యూజియంను తలపిస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు.
వింటేజ్ టర్కిష్ రన్నర్, టేకువుడ్ డెస్క్, బ్రాస్ బటర్ లాంప్, జపనీస్ ప్రింట్లు మరియు ముత్యాల డిజైన్ తో పాటు వీరు సేకరించిన ఎన్నో అరుదైన కళాఖండాలు ఇక్కడ ఉండటం విశేషం.
ఇక బెడ్ రూమ్ విషయానికి వస్తే క్లాసిక్ వింటేజ్ ఫర్నిచర్ ను మోడల్ స్టైల్ తో బ్యాలెన్స్ చేయగా మెయిన్ అట్రాక్షన్‌గా నిలిచే ఫోర్-పోస్టర్ బెడ్, ఫ్లోరల్ వాల్‌పేపర్, ఐవోరీ కార్పెట్ మరియు డార్క్ టీక్‌వుడ్ సైడ్ టేబుల్స్ రూమ్ కి సరికొత్త లుక్ ని తీసుకువచ్చాయనడంలో ఆశ్చర్యం లేదు
ఇక ఆఫీస్ లాంటి స్పేస్ లో సిద్ధార్థ అందుకున్న ఫిలింఫేర్ అవార్డులు ,వింటేజ్ వినైల్ రికార్డులు, ఆయన గురువు కమలహాసన్ ప్రత్యేకంగా గిఫ్ట్ గా అందించిన చేతితో చేసిన ఫిలిం ప్రొజెక్టర్ మరియు అదితి చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన బ్లూ ఆర్ట్‌వర్క్ తో చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది .
ఇక టీవీ రూమ్ విషయానికి వస్తే బ్రైట్ ఎల్లో వాల్‌పేపర్, సబ్యసాచి వెల్వెట్ ఫాబ్రిక్స్, వింటేజ్ కార్పెట్, ఆర్ట్ డెకో బ్రాస్ ఫ్లోర్ లాంప్ వంటి వాటితో ఎంతో రిచ్ అండ్ క్లాసిక్ గా తీర్చిదిద్దారు డిజైనర్స్.
మొత్తానికి తమ అభిరుచులని అన్నింటినీ కలగలిపి ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ లగ్జరీ ప్లాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానాన్ని చురగొంటుంది .
also read:రోమాంచకం స్టోరీ ఇదేనా ? డేటింగ్ యాప్‌తో వచ్చిన కష్టాలు!
ఇక వీరిద్దరి రిలేషన్ విషయానికి వస్తే అజయ్ భూపతి దర్శకత్వంలో 20021 లో సముద్రం సినిమాలో జోడిగా నటించిన ఇద్దరికీ షూటింగ్ సమయంలోనే మంచి రిలేషన్ ఏర్పడింది .అది క్రమంగా ప్రేమగా మారింది. ఏదేమైనా మోడ్రన్ టచ్ మరియు పర్సనల్ మెమరీస్ మిక్సప్ అయి ఉన్న ఈ డిజైనర్ హోమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ టెండ్ అవుతుంది.