E-Paper
Advertisement

Wedding Dinner Fight: చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్-ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?

Wedding Dinner Fight: చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్-ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?
Advertisement

Wedding Dinner Fight: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో విచిత్రమైన ఘటన జరుగుతున్నాయి. అందుకు కారణాలు రెండువైపులా ఉంటాయి. కాకపోతే చిన్నతప్పు కారణంగా అర్థాంతరంగా పెళ్లి ఆగిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. కేవలం రసగుల్లా కారణంగా ఓ పెళ్లి ఆగిపోయిన ఘటన బీహార్‌లో వెలుగుచూసింది.

పెళ్లిలో చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’

Advertisement

బీహార్‌లోని బోద్‌‌గయలోని ఓ వివాహంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. రసగుల్లా కొరత కారణంగా చిన్నపాటి గందరగోళం ఏర్పడింది. దీంతో ఇరువైపుల కుటుంబ సభ్యులు-అతిథులు ఫైటింగ్‌కు దిగారు. దాదాపు అరగంట నుంచి గంట వరకు ఒకరిపై మరొకరు పంఛ్‌లు విసురుకున్నారు. ఆ తర్వాత కుర్చీలను ఒకరిపై మరొకరు విసిరివేశారు.

ఏది కనిపిస్తే అది ఒకరిపై మరొకరు విసురుకుని పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. దీని కారణంగా జరగాల్సిన వివాహం కాస్త రద్దయ్యింది. నవంబర్ 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోద్‌గయలోని ఓ హోటల్‌లో వధువు కుటుంబం బస చేసింది. వరుడి కుటుంబం, బంధుమిత్రులు సమీపంలోని పట్టణ, గ్రామాల నుంచి వచ్చారు.

Advertisement

ఇరువర్గాల మధ్య ఫైటింగ్-ఆగిన పెళ్లి

వివాహానికి ముందు కొంత తతంగం జరుగుతుంది. అది ముగిసిన తర్వాత భోజనాలు ప్రారంభిస్తారు.. అక్కడా అదే చేశారు. పెళ్లి భోజనంలో రసగుల్లా కొరత కారణంగా కొందరికి వడ్డించలేదు. దీంతో వధువు- వరుడు తరపు బంధువులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేయి చేసుకున్నారు. పెళ్లి వ్యవహారం కాస్త ఇరువర్గాల ఘర్షణగా మారిపోయింది.

చివరికి వివాహం సైతం ఆగిపోయింది. ఈ క్రమంలో వధువు కుటుంబం.. వరుడి ఫ్యామిలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై వరకట్న కేసు నమోదు అయ్యింది. వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ రసగుల్లా కొరత కారణంగా గొడవ జరిగిందని ధృవీకరించారు.

ALSO READ: ఢిల్లీకి రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఐదంచెల భద్రత

ఈ సంఘటన తర్వాత వధువు కుటుంబం వరకట్నం కేసు పెట్టిందని చెప్పారు. పెళ్లిలో ఇవన్నీ సహజమేనని భావించి వరుడి కుటుంబం పెళ్లిని కొనసాగించడానికి అంగీకరించింది. అందుకు వధువు కుటుంబం ససేమిరా అంది. దీంతో ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. తాము పెట్టిన బంగారాన్ని తీసుకుని వదువు ఫ్యామిలీ వెళ్లిపోయిందని ఆరోపించారు వరుడి తల్లి.

 

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×