E-Paper
Advertisement

Akhanda 2: అఖండ 2లో భక్త ప్రహ్లాదుడి పాత్ర.. ఈ స్టార్ కిడ్ తో

Akhanda 2: అఖండ 2లో భక్త ప్రహ్లాదుడి పాత్ర.. ఈ స్టార్ కిడ్ తో
Advertisement

Akhanda 2: ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2(Akhanda 2) సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈరోజు సాయంత్రం ఈ సినిమా ప్రీమియర్లు కూడా ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఒక్కో విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచుతున్నారు.

భక్త ప్రహ్లాదుడిగా బోయపాటి వర్షిత్..

తాజాగా అఖండ 2 సినిమాలో భక్త ప్రహ్లాదుడి (bhakta Prahlada) పాత్రకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీను చిన్న కుమారుడు బోయపాటి వర్షిత్(Boyapati Varshith) నటించారని స్వయంగా బోయపాటి శ్రీను తెలియజేశారు. ఇక వర్షిత్ సైతం ఇటీవల జరిగిన ఆఖండ 2 ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని సందడి చేశారు. వేదికపై వర్షిత్ మాట్లాడుతూ.. నా పేరు బోయపాటి వర్షిత్ అని తాను అఖండ 2 సినిమాలో చిన్న పాత్రలో నటించానని మీ అందరి బ్లెస్సింగ్స్ నాపై ఉండాలి అంటూ తన స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే వర్షిత్ నటించబోయేది భక్త ప్రహ్లాదుడిగా అనే విషయం తెలియడంతో చిన్న పాత్ర అయిన ఎంతో కీలకంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి కుమారుడు

Advertisement

బోయపాటి శ్రీను దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక తదుపరి తన వారసులని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తన చిన్న కుమారుడిని బాలయ్య సినిమాలో పరిచయం చేశారు. ఇలా ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్స్ రావడం అనేది సర్వసాధారణం ఇప్పటికే కొంతమంది దర్శకుల పిల్లలు కూడా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరి కొన్ని గంటలలో ప్రీమియర్లు ప్రసారం..

Advertisement

ఇక అఖండ 2 సినిమా విషయానికి వస్తే డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఐదో తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ సినిమా విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం భారీగా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ కూడా చెన్నై బెంగళూరు ముంబై వంటి నగరాలలో ప్రెస్ మీట్ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమాకు కావలసినంత ప్రమోషన్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. బాలకృష్ణకు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా, రామ్ అచంట, గోపి అచంట నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Also Read: Samantha -Raj Nidimoru: సమంత రెండో పెళ్లి… ఆ క్షణం కన్నీళ్లాగలేదు: శిల్పారెడ్డి

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×