Gwalior Accident: ఆలయ సమీపంలోని భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఓ ఆలయం ముందు ఈ ఘటన జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. అసలు ఘటన ఎలా జరిగింది?
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘోర ప్రమాదం
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలో అర్ధరాత్రి ధాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియర్ జిల్లాలోని శీతలా మాత ఆలయం సమీపంలో భక్తులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఆలయానికి సమీపంలో ఉన్న భక్తులపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గాయపడినవారిలో 6 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘోర ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ వరకు అధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు ఒంటి గంట సమయంలో జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు.
గ్వాలియర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-ఎస్ఎస్పి ధర్మవీర్ సింగ్ కీలక విషయాలు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఛినోర్ దిశ నుంచి ధాన్యం లోడుతో వస్తున్న ఓ లారీ అదుపు తప్పింది. శీతలా మాత ఆలయం సమీపంలోని పోలీసు బారికేడ్లను ఛేదించుకుని భక్తులపై దూసుకెళ్లింది. ఆలయ బయటి గోడను ఢీ కొట్టింది. రోడ్డుపై ఉన్న భక్తులు దాని కింద నలిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
దుర్గాదేవి నవరాత్రుల నేపథ్యంలో శీతలా మాత ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఘటనా స్థలంలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. బాధితులను సమపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 39 మందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 12 మంది మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.
ALSO READ: దుర్గామాత పందిరి కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్కత్తాలో ఘటన
నవరాత్రుల సమయంలో ఆ రోడ్డుపై పోలీసు చెక్పోస్టులు ఉందని, వాహనం లోపలికి ఎలా ప్రవేశించిందనేది విచారణలో తేలుతుందని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనకు కారణమేంటో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఓ ఆర్టీఓ బృందాన్ని పంపామని వివరించారు.
ग्वालियर में दर्दनाक हादसा, 13 लोगों की मौत और दो दर्जन से ज्यादा घायल!
शीतला माता मंदिर के पास बेकाबू ट्रक ने कई लोगों की जिंदगी ले ली।
हर हादसे के बाद जांच और कार्रवाई की बातें होती हैं, लेकिन सवाल वही है, आखिर लोगों की जान की सुरक्षा कब? #Gwalior #MadhyaPradesh… pic.twitter.com/uUDiI3bx8Q
— Neeraj Raathi (@neeraj_raathi) October 18, 2026