E-Paper
Advertisement

ఆడి కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి, బాధితుడ్ని తొక్కుకుంటూ వెళ్లిన డ్రైవర్!

ఆడి కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి, బాధితుడ్ని తొక్కుకుంటూ వెళ్లిన డ్రైవర్!
Advertisement

Audi Car Accident: ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. వేగంగా దూసుకొచ్చిన ఒక ఆడి (Audi) కారు బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా కింద పడ్డ ఓ బాధితుడ్ని  తొక్కుకుంటూ వెళ్లింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

ఈ షాకింగ్ ఘటన మంగళవారం (అక్టోబర్ 20) రాత్రి సుమారు 11:10 గంటల ప్రాంతంలో జరిగింది. అలీగఢ్‌లోని జి.టి రోడ్డు (GT Road)లో ఉన్న సరసౌల్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న దృశ్యాలను పరిశీలిస్తే.. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి ఒక తెల్లటి ఆడి కారు అతివేగంగా వచ్చి వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గాల్లోకి ఎగిరి కిందపడగా.. మరొకరు రోడ్డుపై పడిపోయారు.

Advertisement

ప్రమాదం జరిగిన తర్వాత కారును కొద్దిసేపు ఆపిన ఆడి డ్రైవర్.. బైక్ పై వారి పరిస్థితి తెలుసుకునేందుకు ఏమాత్రం బయటకు రాలేదు. పైగా మరింత అమానుషంగా ప్రవర్తించాడు. కిందపడి ఉన్న ఓ క్షతగాత్రుడి పైకి కారును ఎక్కించి పోనిచ్చాడు. ఇది గమనించిన స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి.. డ్రైవర్ ను ఆపే ప్రయత్నం చేశారు. రాళ్లతో కారును కొడుతూ డ్రైవర్ ను నిలువరించబోయారు. అయినప్పటికీ డ్రైవర్ కారును చాలా ఫాస్ట్ గా ముందుకు పోనిచ్చి.. ఘటనా స్థలి నుంచి జంప్ పరారయ్యాడు.

Also Read: రూ. 2,500 లోపే ప్రీమియం ANC ఇయర్‌బడ్స్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్-5 మోడల్స్ ఇవే!

Advertisement

మరోవైపు ప్రమాదంలో మరణించిన వ్యక్తిని మనోజ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన గభానా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్రావల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. అటు తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే బైక్ ను ఢీకొట్టిన కారు.. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు దేవ్‌రాజ్ సింగ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, డ్రైవర్ ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాని పోలీసులు వెల్లడించారు.

Also Read: ఒక మనిషికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండాలి? నిపుణులు ఏమంటున్నారు?

Tags

Related News

ఇన్‌స్టాలోకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ.. ఫస్ట్ ఫోస్టు ఇదే

వృద్ధ తల్లిదండ్రులను వదిలి భర్తను ఇంటల్లుడిగా ఉండాలన్న యువతి.. విడాకుల కేసులో కోర్టు తీర్పు ఇదే

భార్య తల నరికి త్రిశూలంపై పెట్టి తాంత్రిక పూజ, బెంగాల్‌లో గగుర్పొడిచే ఘటన

ఎల్ఐసిలో ఫ్రెషర్స్ జాబ్స్.. 232 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

రిటైర్డ్ ఆర్మీ దంపతులకు షాక్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.61.85 లక్షలు స్వాహా!

కేవలం ప్రియుడి కోసం.. కవలలను చంపిన కసాయి తల్లి, రాజస్థాన్‌లో దారుణం

ఇన్‌ఫ్లుయెన్సర్ సూసైడ్.. వేధింపుల వెనుక ఏం జరిగింది? చెన్నైలో ఘటన

Big Stories

Advertisement
×