BigTV English

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Prostitution: అప్పుడు బంగ్లాదేశ్‌లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ యువతికి ఇండియాకు చెందిన ఓ యువకుడితో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. బంగ్లాదేశ్‌లో ఘోర పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఆమె అక్రమంగా బార్డర్ దాటేసింది. అగర్తలాలోని తన బాయ్‌ఫ్రెండ్‌ను చేరుకుంది. ఆ బాయ్‌ఫ్రెండ్ పది రోజులు ఆమెను ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఫోర్జరీ చేసి తప్పుడు ధ్రువపత్రాలు తయారు చేశాడు. ఆమె కూడా అగర్తలా వాసే అన్నట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేశాడు. ఆ తర్వాత చెన్నైకి చెక్కేశారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ అసలు రూపం చెన్నైలో బయటపడింది.


26 ఏళ్ల బంగ్లాదేశ్ యువతి ఆఫ్రా (పేరు మార్చాం) చట్టవిరుద్ధంగా అంతర్జాతీయ సరిహద్దు దాటి బంగ్లాదేశ్ నుంచి అగర్తలాలో అడుగుపెట్టింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ మొహమ్మద్ యాసిన్ మియాను కలిసింది. ఆమెను పది రోజులు ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఆ సమయంలో ఆఫ్రాను భారతీయ పౌరురాలిగా చిత్రించే డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి సృష్టించాడు. ఆ తర్వాత ఆఫ్రాను మియా చెన్నైకి తీసుకెళ్లాడు. అక్కడ ఆఫ్రాను వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఇందుకు మియా మిత్రులు కపిల్, రుంకిలు సహకరించారు.

ఈ నెల మొదట్లో చెన్నైలోని ఆదంబక్కమ్‌లో వీరికి ఓ ఇల్లు అద్దెకు చూపించారు మియా మిత్రులు. ఆ తర్వాత మియా, ఆయన మిత్రులు ఆఫ్రాను వ్యభిచారంలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురూ బయటి నుంచి విటులను తీసుకువచ్చేవారు. ఆఫ్రా ఉంటున్న గదిలోకి పంపించేవారు. తొలుత ఆఫ్రా ఇందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. కానీ, ఆ తర్వాత రోజు తినడానికి, ఉండటానికి ఖర్చుల కోసం తప్పక అంగీకరించాల్సి వచ్చింది.


Also Read: Toll Gate: ఏమిటీ ఈ దారుణం.. రోడ్డు నిర్మాణ ఖర్చు కంటే నాలుగు రెట్లు అధికంగా టోల్ వసూళ్లు.. కేంద్రం ఏమంటున్నదంటే?

ఆ సమయంలో ఆఫ్రాను రూమ్‌లో బంధించేవారు. ఎప్పుడు ఆ ఇంటికి వెలుపల తాళం వేసే ఉంచేవారు. ఎవరినైనా విటులను తీసుకువచ్చినప్పుడు మాత్రమే ఆ తాళం తీసి డోర్ ఓపెన్ చేసేవారు. అలా ఒకసారి డోర్ తీసినప్పుడు ఆమె తృటిలో పారిపోయింది. వెంటనే ఓ ఆటో రిక్షా ఎక్కేసి పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. గిండి పోలీసు స్టేషన్‌కు చేరుకుని తనను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారని ఏసీపీ డీ విజయరాములుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

ఈ దర్యాప్తులో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆ ఆఫ్రా భారతీయురాలు కాదని, బంగ్లాదేశ్‌కు చెందిన యువతి అని మియా పోలీసులకు తెలిపాడు. దీంతో ఆమె ధ్రువపత్రాలను పరిశీలించారు. అగర్తలా అధికారులను సంప్రదించి ఆరా తీయగా.. అవి నకిలీవని తేలాయి. దీంతో అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించడం, పాస్‌పోర్ట్, వీసా లేకుండా భారత్‌లో ఉన్నందుకు ఫారీనర్స్ యాక్ట్ కింద పోలీసులు ఆఫ్రాను అరెస్టు చేశారు. మియా, ఆఫ్రాను మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు పంపింది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

High Alert In Bihar: రాష్ట్రంలో హైఅలర్ట్.. బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు

US Drinks Ban: ట్రంప్ టారిఫ్.. అమెరికాకు షాకిచ్చిన వర్సిటీ, శీతల పానీయాలపై నిషేధం

Palghar Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో కూలిన భవనం.. 15 మంది మృతి

Big Stories

×