Tammareddy Bharadwaj: ఇప్పటివరకు అన్ని ఇండస్ట్రీలో రగులుతున్న లైంగిక వేధింపుల రచ్చ.. ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. జూనియర్ ఆర్టిస్ట్ ను లైంగికంగా వేధించడం, ఆమె వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మొదలయ్యింది. జానీ , తనను లైంగికంగా వేధించాడని, రేప్ చేయడానికి ప్రయత్నించాడని, వాళ్ల భార్య కూడా తనను మతం మార్చుకోమని టార్చర్ చేసిందని డ్యాన్సర్ ఫిర్యాదులో పేర్కొంది.
సెలబ్రిటీ ముసుగు వేసుకొని ఆడవారిని ఈ విధంగా హింసిస్తున్న జానీపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రముఖులు కూడా గళం విప్పుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో నటి పూనమ్ కౌర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసి మరింత హీట్ పెంచింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.
” త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నేను మా అసిసోయేషన్ లో ఫిర్యాదు చేశాను. కానీ, నా ఫిర్యాదును తిరస్కరించారు. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. నన్ను సైలెంట్ గా ఇగ్నోర్ చేశారు. ఇప్పటికైనా త్రివిక్రమ్ ను ప్రశ్నించాలి” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. అయితే పూనమ్ కు ఇలాంటి ట్వీట్స్ కొత్తేమి కాదు అని లైట్ తీసుకున్నవారు కొంతమంది అయితే.. ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు అని మరికొందరు చెప్తున్నారు.
Garudan: తమిళ్ రీమేక్ లో కుర్ర హీరోలు.. ఒకరిని మించి ఒకరు ఉన్నారే
ఇక పూనమ్ ట్వీట్ పై నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. పూనమ్ ఫిర్యాదు ఇచ్చిన విషయం అసలు తమకు తెలియనే తెలియదని చెప్పడం విశేషం. ” పూనమ్.. ఎప్పుడు, ఏ సంవత్సరంలో ఫిర్యాదు చేసిందో మాకు తెలియదు. మా వరకు ఆ ఫిర్యాదు రాలేదు. అయినా అప్పటికీ ఈ కమిటీ ఏర్పాటు అయ్యి ఉంటే.. మాకు ఇప్పటికే తెలిసేది. అక్కడ ఉన్న ఫిర్యాదు బాక్స్ లో ఒక్క ఫిర్యాదును కూడా మేము చూడలేదు.
ఫిర్యాదు లేకుండా మేము ఏమి చేయలేము.. ముందుకు వెళ్లలేము. చివరికి మా అసోసియేషన్ వాళ్లు అయినా ఇలా ఫిర్యాదు వచ్చిందని మాకు చెప్పలేదు. పోనీ ఆ ఫిర్యాదును మాకు పంపించినా మేము చూసుకొనేవాళ్ళం. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి దీనిపై పూనమ్ ఎలా స్పందిస్తుంది.. ? కొత్తగా మళ్లీ కంప్లైంట్ ఇస్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.