BigTV English

Toll Gate: ఏమిటీ ఈ దారుణం.. రోడ్డు నిర్మాణ ఖర్చు కంటే నాలుగు రెట్లు అధికంగా టోల్ వసూళ్లు.. కేంద్రం ఏమంటున్నదంటే?

Toll Gate: ఏమిటీ ఈ దారుణం.. రోడ్డు నిర్మాణ ఖర్చు కంటే నాలుగు రెట్లు అధికంగా టోల్ వసూళ్లు.. కేంద్రం ఏమంటున్నదంటే?

Nitin Gadkari: మనకు అందిస్తున్న సేవల విలువ కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే ఏమనిపిస్తుంది. తప్పకుండా నిలదీస్తాం. అదనపు వసూళ్లు ఎందుకు అని ప్రశ్నలు గుప్పిస్తాం. ప్రభుత్వ పనులకూ ఇది వర్తిస్తుంది. ఆర్టీఐ ద్వారా ఓ సంచలన విషయం బయటికి వచ్చింది. ఢిల్లీ – జైపూర్ హైవే నిర్మాణానికి రూ. 1,900 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. కానీ, ఆ దారిపై మనోహర్‌పూర్‌ వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ ద్వారా రూ. 8,000 కోట్లు ప్రయాణికుల నుంచి వసూలు చేశారు. అంటే రోడ్డు నిర్మాణానికి అయిన ఖర్చుకు నాలుగు రెట్ల కంటే కూడా ఎక్కువ మొత్తంలో వసూలయ్యాయి. ఇది షాకింగ్‌గా ఉన్నా నిజం. ఇదే విషయాన్ని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇచ్చారు.


రోడ్డు నిర్మాణానికి రూ. 1,900 కోట్లు ఖర్చు చేస్తే.. టోల్ గేట్ ద్వారా రూ. 8,000 అంటే చాలా ఎక్కువగా ఎందుకు వసూలు చేశారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. టోల్ ట్యాక్స్‌లు ఒకే రోజు వసూలు చేసేవి కావని, ఈ టోల్ వసూలుకు ముందు, తర్వాత కూడా ప్రభుత్వం చాలా ఖర్చులను భరించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు ఓ ఉదాహరణ కూడా ఇచ్చారు.

‘మీరు ఒక ఇల్లు లేదా కారును నగదు పెట్టి కొనుగోలు చేశారని అనుకుందాం. అప్పుడు దానికి రూ. 2.5 లక్షలు అనుకుందాం. ఒక వేళ నగదు పెట్టకుండా ఇందుకోసం పదేళ్ల గడువుతో లోన్ తీసుకున్నట్టయితే.. దాని విలువ రూ. 5.5 లక్షల నుంచి 6 లక్షల వరకు పెరుగుతుంది. ప్రతి నెలా వడ్డీ చెల్లించాల్సిందే. చాలా సార్లు రోడ్ల నిర్మాణం వంటి పనులు లోన్లు తీసుకునే చేపట్టాల్సి ఉంటుంది’ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.


Also Read: Financial Assistance: బ్రేకింగ్ న్యూస్.. ప్రతి ఇంటికీ రూ. 25 వేల ఆర్థికసాయం ప్రకటించిన ప్రభుత్వం

ఇంకా ఈ విషయం గురించి కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘ఆ రోడ్డును 2009లో నాటి యూపీఏ ప్రభుత్వం అలాట్ చేసింది. ఈ ప్రాజెక్టులో 9 బ్యాంకులు ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణంలో చాలా సమస్యలు వచ్చాయి. కాంట్రాక్టర్లు పారిపోయారు. బ్యాంకులు కోర్టు ఆశ్రయించి కేసులు వేశాయి. కొత్త కాంట్రాక్టర్లు వచ్చారు. మేం కొత్త కాంట్రాక్టర్లను టర్మినేట్ చేశాం. ఢిల్లీ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ రోడ్డు కోసం మేం కొత్త డీపీఆర్ రూపొందించాం. ఈ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు మొదలయ్యాయి. ఆరు లేన్ల రహదారి నిర్మించాలంటే ఆ ఆక్రమణలను తొలగించాల్సిందేనని మేం అనుకున్నాం. ఈ సారి వర్షం కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం.. ’అంటూ చెప్పుకుపోయారు.

ఓ యాక్టివిస్టు దాఖలు చేసిన ఆర్టీఐతో ఈ విషయం వెలుగు చూసింది. ఢిల్లీ- జైపూర్ రహదారిపై మనోహర్‌పూర్ టోల్ ప్లాజా నుంచి సుమారు రూ. 8 వేల కోట్ల టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసినట్టు తేలింది. వాస్తవానికి ఆ రోడ్డు నిర్మాణానికి రూ. 1900 కోట్లు ఖర్చు అయ్యాయి. దీంతో ప్రభుత్వ వ్యవహారంపై సందేహాలు వచ్చాయి.

Related News

Chief Ministers: అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో చంద్రబాబు

Los Angeles News: అందరూ చూస్తుండగా.. భారతీయుడిని కాల్చి చంపారు.. ఇదిగో వీడియో!

Bihar Politics: బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీ.. మోదీ తల్లిని దూషించిన వ్యక్తి అరెస్ట్

Trump Tariffs: భారత్ బిగ్ స్కెచ్! ట్రంప్‌కు దూలతీరిందా?

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు..

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Big Stories

×