E-Paper
Advertisement

రాఘవ్ చద్దాకు బిగ్ షాక్.. రాత్రికి రాత్రే 10 లక్షల మంది అన్ ఫాలో

రాఘవ్ చద్దాకు బిగ్ షాక్.. రాత్రికి రాత్రే 10 లక్షల మంది అన్ ఫాలో
Advertisement

MP Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చద్దా షాకిస్తే.. జెన్ జెడ్ రాఘవ్ చద్దాకు షాకిచ్చారు. బీజేపీలో చేరిన వెంటనే 10 మంది ఎంపీ రాఘవ్ చద్దా ఇన్ స్టా అకౌంట్ ను అన్ ఫాలో చేశారు. చద్దా సహా ఆరుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు శుక్రవారం బీజేపీలో చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ తన శ్రేణులను ఐక్యంగా ఉంచుకోవడానికి నానా తంటాలు పడుతుంది. ఇటీవల ఆప్ రాజ్యసభ ఉప నేత పదవి నుంచి రాఘవ్ చద్దాను ఆప్ తొలగించింది. అప్పటి నుంచీ చద్దా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. తాజాగా ఆయన తన వర్గం నేతలతో కలిసి కాషాయ పార్టీలో చేశారు. ఈ నిర్ణయం జెన్ జెడ్ ను నిరుత్సాహానికి గురిచేసినట్లు కనిపిస్తుంది. రాత్రికి రాత్రే రాఘవ్ చద్దా ఇన్ స్టా అకౌంట్ లో 10 లక్షల ఫాలోవర్స్ తగ్గారు.

10 లక్షల యూజర్స్ అన్ ఫాలో

పార్లమెంట్ లో జెన్ జెడ్ కు అనుకూలంగా ప్రశ్నలు వేయడంలో రాఘవ్ చద్దాకు సోషల్ మీడియా భారీగా ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. దీంతో రాఘవ్ చద్దా వీడియోలు తరచూ వైరల్ అవుతున్నాయి. అయితే పార్లమెంట్ లో మోదీకి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై నోరు విప్పేందుకు చద్దా భయపడుతున్నారని, ఆప్ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తప్పించింది. గత కొంత కాలంగా ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. శుక్రవారం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత 24 గంటలలోపే ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు పది లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయారు చద్దా. శుక్రవారం నాటికి 14.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన ఫాలోవర్ల సంఖ్య 13.5 మిలియన్లకు పడిపోయింది.

Advertisement

ఎంపీ రాఘవ్ చద్దాపై వ్యతిరేకతకు ముఖ్యంగా జెన్ జెడ్ కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయాన్ని ఎన్‌సీపీ (ఎస్‌పి) అధికార ప్రతినిధి అనీష్ గవాండే ట్వీట్ చేశారు. ఇంటర్నెట్ మిమ్మల్ని రాత్రికి రాత్రే హీరోగా చేయగలదు. అలాగే రాత్రికి రాత్రే మిమ్మల్ని సున్నాకి పడేయగలదు అని ఆయన ట్వీట్ చేశారు.

రాఘవ్ చద్దాకు బిగ్ షాక్

ప్రజల రోజువారీ సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తడంతో ముఖ్యంగా యువతలో రాఘవ్ చద్దా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పితృత్వ సెలవులు, ట్రాఫిక్ సంక్షోభం, టెలికాం కంపెనీల రోజువారీ డేటా పరిమితుల మొదలుకుని, విమానాశ్రయాల్లో ఖరీదైన సమోసాలు, 10 నిమిషాల డెలివరీ పద్ధతుల ద్వారా గిగ్ వర్కర్ల దోపిడీ వంటి సున్నితమైన సమస్యలను ఆయన రాజ్య సభలో ప్రస్తావించారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొనే సవాళ్లను తెలుసుకోవడానికి ఒక రోజు బ్లింకిట్ డెలివరీ బాయ్ గా పనిచేశారు. డెలివరీ కంపెనీలకు 10 నిమిషాల డెలివరీ గడువును తొలగించాలని కేంద్రం సూచించడంతో రాఘవ్ చద్దా పేరు సోషల్ మీడియాలో మారుమోగింది.

Advertisement

Also Read: వైరల్ వీడియో: ఎంపీ రాఘవ్ చద్దా మాస్ స్టెప్.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా మారి కస్టమర్ ఇంటికి! 

రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్‌గా చద్దాను తొలగించినప్పటికీ నుంచి ఆయన జెడ్ జెడ్ మద్దతు మరింత పెరిగింది. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను వివాహం చేసుకున్న ఆయన.. సొంతంగా ‘జెన్ జెడ్ పార్టీ’ని ఏర్పాటు చేయాలని ఓ యూజర్ సూచించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను కూడా షేర్ చేశారు. అయితే ఆయన బీజేపీలో చేరడంతో జెన్ జెడ్ అన్ ఫాలో చేస్తున్నారని పలువురు అంటున్నారు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×