E-Paper
Advertisement

Raghav Chadha: వైరల్ వీడియో: ఎంపీ రాఘవ్ చద్దా మాస్ స్టెప్.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా మారి కస్టమర్ ఇంటికి! 

Raghav Chadha: వైరల్ వీడియో: ఎంపీ రాఘవ్ చద్దా మాస్ స్టెప్.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా మారి కస్టమర్ ఇంటికి! 
Advertisement

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా గిగ్ వర్కర్ల (డెలివరీ ఏజెంట్లు) రోజువారీ కష్టాలను అర్థం చేసుకోవడానికి ఒక వినూత్న ప్రయత్నం చేశారు. విధానపరమైన చర్చలకు కాసేపు విరామం ఇచ్చి, ఆయన స్వయంగా ‘బ్లింకిట్’ (Blinkit) డెలివరీ భాగస్వామిగా మారి ఆ అనుభవాన్ని చవిచూశారు. దీనికి సంబంధించిన ఒక టీజర్ వీడియోను ఆయన ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు.

పార్లమెంటు నుండి డెలివరీ రూట్లలోకి..

ఆ వీడియోలో చద్దా బ్లింకిట్ టీ-షర్ట్ మరియు జాకెట్ ధరించి, డెలివరీ బ్యాగ్‌ను భుజానికి తగిలించుకున్నారు. ఒక డెలివరీ పార్ట్నర్ నడుపుతున్న స్కూటర్ వెనుక కూర్చుని స్థానిక స్టోర్ నుండి ఆర్డర్‌ను సేకరించడం, ఆపై కస్టమర్ ఇంటికి వెళ్లడం వంటి దృశ్యాలు అందులో ఉన్నాయి. సమయంతో పోటీ పడుతూ డెలివరీ చేసే ప్రక్రియలో వారు ఎదుర్కొనే సవాళ్లను ఈ వీడియోలో చూపించారు. చివరగా కస్టమర్ ఇంటి డోర్ బెల్ కొట్టే సమయానికి “స్టే ట్యూన్డ్” (వేచి ఉండండి) అనే సందేశంతో వీడియో ముగుస్తుంది.

Advertisement

ఈ వీడియోను షేర్ చేస్తూ.. “బోర్డ్ రూమ్ చర్చలకు దూరంగా, క్షేత్రస్థాయిలో వారి జీవితాన్ని ఒక రోజంతా గడిపాను. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాను” అని రాఘవ్ చద్దా రాశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, స్వయంగా రంగంలోకి దిగి అనుభవాన్ని పొందినందుకు నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు.

గిగ్ వర్కర్ల పని పరిస్థితులపై రాఘవ్ చద్దా ఇప్పటికే పార్లమెంటులో గళమెత్తారు. తక్కువ ఆదాయం, నిర్ణీత సమయం లేని పని గంటలు, ఆరోగ్య బీమా లేకపోవడం, సామాజిక భద్రత కరవు కావడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. డిసెంబర్ 2025లో ఒక బ్లింకిట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ తన సంపాదన గురించి చేసిన వీడియో వైరల్ కావడంతో ఈ చర్చ తీవ్రమైంది. అప్పట్లో చద్దా ఆ డెలివరీ పార్ట్నర్‌ ఉత్తరాఖండ్‌కు చెందిన థప్లియాల్ జీ కలిసి, తన నివాసానికి భోజనానికి కూడా ఆహ్వానించారు.

Advertisement

Related News

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

ఎస్‌బిఐ స్పెషల్ ఆఫీసర్ జాబ్స్.. వార్షిక వేతం రూ.97 లక్షలు

వందేమాతరంపై మరో వివాదం.. ఈసారి మిత్రపక్షంతో కాంగ్రెస్‌కు పేచి.. విరుచుకుపడ్డ బీజేపీ!

2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ విద్యార్హతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జాబ్స్

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు

Big Stories

Advertisement
×