E-Paper
Advertisement

సంచలనం రేపుతున్న సెన్సార్ బోర్డ్‌ డేటా లీక్.. 500 చిత్రాలకు రికార్డులు బయటకు

సంచలనం రేపుతున్న సెన్సార్ బోర్డ్‌ డేటా లీక్.. 500 చిత్రాలకు రికార్డులు బయటకు
Advertisement

CBFC Data Leak: ఈ మధ్యకాలం దేశంలో డేటా లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. వివిధ శాఖలకు సంబంధించిన డేటా లీక్ కావడంతో గుబులు రేపుతోంది. మొన్నటికి మొన్న బ్యాంకులు కాగా, ఇప్పుడు కేంద్ర సెన్సార్ బోర్డు వంతైంది. దాదాపు 500 సినిమాలకు సంబంధించిన రికార్డులు బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది.

సంచలనం రేపుతున్న సెన్సార్ బోర్డ్‌ డేటా లీక్

దేశంలో ఇంటర్నెట్ సెక్యూరిటీ వ్యవస్థ బలహీనం ఉన్నట్లు కనిపిస్తోంది. కనీసం వారంలో ఒక్కో కంపెనీ లేదా వివిధ శాఖల నుంచి డేటా లీక్ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. వెబ్‌సైట్‌లు రోజురోజుకూ బలహీనంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్-CBFCలో జరిగిన డేటా లీక్‌లో ఫీచర్ ఫిల్మ్‌లతోపాటు సుమారు 500కు పైగా చిత్రాల ధృవీకరణ రికార్డులు బయటపడ్డాయి.

500 చిత్రాలకు డేటా రికార్డులు బయటకు

Advertisement

ఈ సిని ప్రమాణ పోర్టల్ నుంచి లీకైన సమాచారంలో తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతి పొందడం కోసం చిత్ర నిర్మాతలు సమర్పించిన స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్‌లు, ఇతర పత్రాలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ కార్యాలయం దాటి బయటకు రాని పత్రాలుగా అనిపించినప్పటికీ, ఈ రికార్డులలో కొన్ని సున్నితమైన వ్యాపార సమాచారాన్ని కలిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

CBFC డిజిటలైజ్ చేయడానికి సరిగ్గా దశాబ్దం కిందట ఇ-సినీప్రమాణ్ ఆన్‌లైన్ పోర్టల్‌ తీసుకొచ్చింది. నిర్మాతలు తమ సినిమాల ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ పోర్టల్ ద్వారా వివిధ పత్రాలను సమర్పిస్తారు. జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. బహిర్గతమైన పత్రాలు ఇ-సినీ ప్రమాణ్ పోర్టల్ ద్వారా బయటకు వచ్చాయనే ఆరోపణలు లేకపోలేదు. చాలా పత్రాలు ఇంతకుముందే అప్‌లోడ్ చేశారని, ఆ తర్వాత తొలగించబడినప్పటికీ అవి రోజుల తరబడి అందుబాటులో ఉన్నాయని అంటున్నారు.

ALSO READ: భర్త విద్యార్థి అయినా భార్యకు భరణం ఇవ్వాల్సిందే.. హై కోర్టు షాకింగ్ తీర్పు

Advertisement

లీకైన ఫైల్స్ అసలు సినిమాలు కావని, సర్టిఫికేషన్ సమయంలో సమర్పించిన షూటింగ్ స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్‌లు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ మెటీరియల్‌ను అంతా తొలగించినట్లు సమాచారం. కొన్ని రికార్డుల్లో బ్రెజిల్ అకాడమీ అవార్డుకు నామినేట్ అయిన ది సీక్రెట్ ఏజెంట్, హాలీవుడ్ చిత్రం గుడ్ లక్, హావ్ ఫన్, డోంట్ డై వంటి చిత్రాల స్థానిక పంపిణీ ఒప్పందాలు ఉన్నాయని ఆ వార్తల్లో సారాంశం. కనీసం మూడు ఒప్పందాలు చిత్రాల లైసెన్సింగ్ కోసం చెల్లించిన రుసుముల పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 4న పోర్టల్ గంటల తరబడి అందుబాటులో లేకుండా పోయిన తర్వాత ఆ వినియోగదారుడు ఫైళ్లను అప్‌లోడ్ చేయడం ఆపేశారని CBFC వెల్లడించింది. ఏ నిర్మాత ఖాతా హ్యాక్ అయినట్లు కనిపించలేదని, పూర్తిస్థాయి భద్రతా తనిఖీకి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సమాచారం.

Related News

భర్త విద్యార్థి అయినా భార్యకు భరణం ఇవ్వాల్సిందే.. హై కోర్టు షాకింగ్ తీర్పు

కోపంతో మరిది ప్రైవేటు పార్ట్స్ కొరికిన వదిన, ఎన్నికుట్లు పడ్డాయంటే, యూపీలో షాకింగ్ ఘటన

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే

ప్రేమ పేరుతో 20 మంది లేడీ కానిస్టేబుళ్లను పడేసిన కేటుగాడు.. కానీ చివరికి..?

యూపీలో దారుణం.. బైక్‌ను ఢీకొట్టి.. ఒంటిపై నుంచి కారు ఎక్కించి..

జామియా వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులు, గార్డుల మధ్య ఘర్షణ.. తరగతులు ఆన్‌లైన్‌కు మళ్లింపు!

ర్యాపిడో డ్రైవర్ ముసుగులో జైషే ఉగ్రవాది.. కస్టమర్లను ఎక్కించుకుంటూ.. పాక్‌తో కలిసి ఉగ్ర కుట్రలు!

Big Stories

Advertisement
×