E-Paper
Advertisement

ఫోన్‌లో ఈ 5 యాప్స్ ఉంటే చాలు.. మీ పర్స్, ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట మోయక్కర్లేదు!

ఫోన్‌లో ఈ 5 యాప్స్ ఉంటే చాలు.. మీ పర్స్, ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట మోయక్కర్లేదు!
Advertisement

Government Apps: డిజిటల్ విప్లవంతో భారత్‌లో సర్వీసులను పొందే తీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ సేవలను పొందడానికి, గుర్తింపు కార్డులను దాచుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఈ రోజుల్లో లేకుండా పోయింది. పేపర్ కాపీలను ప్రతీ చోటకు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా కొన్ని డిజిటల్ యాప్స్ ఉపయోగపడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి.. పేపర్ లెస్ గా జీవించడానికి కేంద్రం అనేక అధికారిక యాప్స్ అందుబాటులోకి తెచ్చింది. ప్రతీ పౌరుడికి ఉపయోగపడే ఆ 5 అత్యవసర మెుబైల్ యాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

డిజిలాకర్ (DigiLocker)

డిజిలాకర్ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే వర్చువల్ డాక్యుమెంట్ వాలెట్. పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, పాన్ కార్డు, రేషన్ కార్డు వంటి ముఖ్యమైన పత్రాలను ఇందులో భద్రంగా దాచుకోవచ్చు. డిజిలాకర్‌లో ఉన్న డిజిటల్ డాక్యుమెంట్లు ఫిజికల్ గా ఉన్న ఒరిజినల్ కాపీలతో సమానంగా పరిగణిస్తారు. ఎక్కడైనా ఐడీ ప్రూఫ్ లేదా సర్టిఫికేట్లు చూపించాల్సి వచ్చినప్పుడు నేరుగా మొబైల్ నుంచే సర్టిఫికేట్లు చూపించవచ్చు.

ఉమాంగ్ (UMANG)

Advertisement

ఈ యాప్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వేలాది సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, పాన్ కార్డు సేవలు, గ్యాస్ సిలిండర్ బుకింగ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి సేవలను ఈ ఒక్క యాప్ నుంచే పొందొచ్చు. వేర్వేరు ప్రభుత్వ శాఖల కోసం వేర్వేరు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకుండా సమయాన్ని, ఫోన్ స్టోరేజీని ఇది ఆదా చేస్తుంది.

భీమ్ (BHIM UPI)

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన BHIM యాప్ డిజిటల్ లావాదేవీలకు ఏంతో సేఫ్ అయినది. దీని సాయంతో ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బు బదిలీ, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు వంటి సేవలను పొందొచ్చు. నగదు రహిత చెల్లింపుల ద్వారా పేపర్ కరెన్సీ, ఫిజికల్ బ్యాంక్ రసీదులతో పనిలేకుండా ఈ యాప్ చేస్తుంది.

ఎం-ఆధార్ (mAadhaar)

Advertisement

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) రూపొందించిన అధికారిక యాప్ mAadhaar. ఆధార్ కార్డును జేబులో భౌతికంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేకుండా వర్చువల్ ఆధార్ (eAadhaar), క్యూఆర్ కోడ్, ఆధార్ ప్రొఫైల్‌ను ఇందులో సేవ్ చేసుకోవచ్చు. ఇంటి చిరునామా మార్పు, ఈ-కేవైసీ సమాచారం షేరింగ్, ఆధార్ లాక్ – అన్‌లాక్ వంటి సేవలు ఈ యాప్ ద్వారా లభించనున్నాయి.

Also Read: అమెరికన్లు బట్టలు బయట ఎందుకు ఆరేయరు? కారణాలు తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు!

ఎం-పరివాహన్ (mParivahan)

రవాణా మంత్రిత్వ శాఖ రూపొందించిన mParivahan వాహనదారులకు వరప్రసాదంగా మారింది. డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లను యాప్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేసినప్పుడు భౌతిక కాగితాలు చూపే పనిలేకుండా ఈ వర్చువల్ ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లు చూపిస్తే సరిపోతుంది.

Also Read: జియో vs ఎయిర్‌టెల్.. రూ.500 లోపు ప్లాన్లలో ఏది బెటర్? పూర్తి వివరాలు!

Tags

Related News

కత్తి అక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు.. ఫ్రీజర్ మంచును ఈజీగా క్లీన్ చేసే సింపుల్ టిప్స్!

స్లీప్ మోడ్‌లో ల్యాప్‌టాప్ పెడుతున్నారా? వెంటనే ఆపండి.. లేదంటే తప్పదు భారీ మూల్యం!

నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో కొత్త ఇయర్ బడ్స్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు

47% డిస్కౌంట్‌తో స్మార్ట్ టీవీ..ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

ఇంటి పైకప్పుపై నీళ్ల బాటిల్.. 30కి పైగా దేశాలు ఫాలో అవుతున్న పవర్ సేవింగ్ ట్రిక్ ఇదే!

రూ.1,299ధరలో బెస్ట్ ఫీచర్స్..తక్కువ ధరలో ప్రీమియం లుక్

ఏసీ కొనడానికి ఇదే రైట్ టైమ్.. చలికాలంలో కొంటే ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×