E-Paper
Advertisement

CCTV footage on Delhi Blast: ఢిల్లీ పేలుడు ఘటన ..వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్, ఆ తర్వాత ఒక్కసారిగా

CCTV footage on Delhi Blast: ఢిల్లీ పేలుడు ఘటన ..వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్, ఆ తర్వాత ఒక్కసారిగా
Advertisement

CCTV footage on Delhi Blast: ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు సాగుతోంది. ఈ తరుణంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు సంబంధించిన వీడియో ఫుటేజ్ బుధవారం వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ పేలుడు ఘటన, వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

Advertisement

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పేలుడు ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలో పేలుడు దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఓ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన వీడియోలో సిగ్నల్‌ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

అదే సమయంలో హ్యుందాయ్ i20 కారులో అధిక తీవ్రతతో కూడిన పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత ఆ సమీపంలోని ప్రజలు దాక్కునేందుకు పరిగెత్తడంతో గందరగోళం నెలకొంది. ఈ దాడిలో ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement

రద్దీగా పేలుడు ప్రాంతం.. ఒక్కసారిగా పేలుడు

15 సెకన్ల క్లిప్‌లో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉంది. డజన్ల కొద్దీ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.  ఈ ఘటనకు ముందు జమ్మూకాశ్మీర్-హర్యానా-‌ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించిన జైష్-ఎ-మొహమ్మద్‌ ఉగ్ర సంస్థకు సంబంధించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌ను వెలికితీశారు. ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

దాదాపు 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు జరిగింది. అరెస్టయిన వారిలో డాక్టర్ ముజమ్మిల్ గనై, డాక్టర్ షాహీన్ సయీద్ ఉన్నారు, వీరిద్దరు ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందినవారు.

ALSO READ: ఢిల్లీ పేలుడు ఘటన.. పాక్ పనే, జర్నలిస్టు కీలక విషయాలు వెల్లడి

ఢిల్లీ నుండి 45 కిలోమీటర్ల దూరంలోని ధౌజ్‌ ప్రాంతంలోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన ఓ ప్రైవేట్ సంస్థ. ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనలో కారును నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీకి అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉంది. ఈ ఘటనలో అతడు మరణించినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నారు.

 

 

 

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×