E-Paper
Advertisement

Delhi Vs Islamabad Blasts: ఢిల్లీ పేలుడు ఘటన.. దాయాది దేశం పనే? నిజాలు చెప్పిన పాక్ జర్నలిస్ట్

Delhi Vs Islamabad Blasts: ఢిల్లీ పేలుడు ఘటన..  దాయాది దేశం పనే? నిజాలు చెప్పిన పాక్ జర్నలిస్ట్
Advertisement

Delhi Vs Islamabad Blasts: ఢిల్లీ పేలుడు ఘటన వెనుక ఎవరి ప్రమేయం ఉంది? ఈ ఘటన వెనుక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉందా? డైరెక్ట్‌గా కాకుండా ఇన్ డైరెక్ట్‌గా ఆ పని చేయించిందా? ముమ్మాటికీ అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. ఢిల్లీ బ్లాస్ట్ ఘటన జరిగిన గంటల వ్యవధిలో ఇస్లామాబాద్‌లో పేలుడు చోటు చేసుకోవడం వెనుక ఏం జరిగింది? రెండింటి వెనుక పాకిస్థాన్ టెర్రర్ గ్రూపులు ఉన్నాయా? అవుననే అంటున్నారు ఆదేశ జర్నలిస్ట్ టహా సిద్దిఖీ.

ఢిల్లీ పేలుడు వెనుక దాయాది దేశం హస్తం?

Advertisement

సోమవారం రాత్రి ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో స్పాట్‌లో 9 మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా వార్తలు లేకపోలేదు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ టెర్రర్ గ్రూపుల ప్రమేయం ఉందని నిఘా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

ఢిల్లీ పేలుడు ఘటన జరిగిన మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయం ఇస్లామాబాద్‌లో కారు బ్లాస్ట్ ఘటన చోటు చేసుకుంది. జిల్లా న్యాయస్థానం ముందు ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది స్పాట్‌లో మృత్యువాత పడ్డారు. చాలామంది గాయపడ్డారు.  గంటల వ్యవధిలో ఇండియా-పాక్ దేశాల రాజధానిలో పేలుళ్లు జరగడంపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. దీని వెనుక టెర్రర్ గ్రూపుల ప్రమేయం ఉన్నట్లు వార్తలు లేకపోలేదు.

Advertisement

పాక్ జర్నలిస్ట్ సంచలన నిజాలు

ఇస్లామాబాద్ ఘటన వెనుక భారత్ హస్తం ఉందని దాయాది చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది భారత ప్రభుత్వం. ఆ దేశంలో అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడి పాలకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బదులిచ్చింది. ఉగ్రవాదాన్ని భారత్ ఎన్నడూ ప్రోత్సహించదన్నారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. పొరుగు దేశంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దాయాది దేశం ఇలాంటి తప్పుడు కథనాలను సృష్టించడం కొత్తేమీ కాదని, వాస్తవ పరిస్థితులు ఏంటో అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసన్నారు. ఆదేశంలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపారు.

ALSO READ:  ఢిల్లీ పేలుడు కేసు.. టార్గెట్ జనవరి 26 ప్లాన్, ఈలోగా రెక్కీలు

ఢిల్లీ పేలుడు ఘటన జరిగిన 24 గంటలు గడవక ముందే ఇస్లామాబాద్‌లో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల వెనుక పాకిస్తాన్ సైన్యం ఉందన్నారు ఆ దేశ జర్నలిస్ట్ టహా సిద్దిఖీ. ఈ రెండు నగరాల్లో ఆత్మాహుతి దాడి జరిగిందన్నారు. పాకిస్తాన్ సైన్యానికి తమ దేశంలోని ఇస్లామిక్ టెర్రర్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జనరల్స్.. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని దేశీయ-విదేశాంగ విధాన సాధనంగా ఉపయోగించకుండా ఆపనంత వరకు దక్షిణాసియాలో శాంతి ఉండదన్నారు. టెర్రరిజం అనేది పాకిస్తాన్‌కు వ్యాపారంగా మారిందన్నారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాద చర్యల గురించి గర్వంగా మాట్లాడుకునేవారు. ఈ లెక్కన చూస్తే ఢిల్లీ పేలుడు వెనుక పాక్ ఉందని చెప్పకనే చెప్పారాయన.  దాన్ని నుంచి తప్పించుకునేందుకు ఇస్లామాబాద్ ఘటనను భారత్‌పైకి నెట్టేందుకు  ప్రయత్నాలు మొదలుపెట్టింది దాయాది దేశం.

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×