E-Paper
Advertisement

Top 20 News Today: నల్గొండలో నేడు కవిత జనం బాట, కీలక మలుపు తిరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారం..

Top 20 News Today: నల్గొండలో నేడు కవిత జనం బాట, కీలక మలుపు తిరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారం..

1. సీఐఐ పార్టనర్‌ షిప్ సమ్మిట్‌‌కి హైరేంజ్‌లో ఏర్పాట్లు

విశాఖలో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌ షిప్ సమ్మిట్‌లో అతిథులను ఆశ్చర్య పరచడానికి సమ్మిట్ వేదిక వద్ద స్టార్ హోటల్ స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రెస్ట్ రూమ్స్‌ని స్టార్ హోటల్ రేంజ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ షింక్స్, వాష్ రూమ్ కమోడ్స్, టాయిలెట్ షింక్స్‌ని హైరేంజ్‌లో రెండు రోజుల కోసం తీర్చిదిద్దుతున్నారు. అధికారులు.

2. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కేసులు నమోదు..

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కేసులు నమోదు అయ్యాయి. ఓటింగ్‌ రోజు ప్రచారం చేయడంతో వైరా ఎమ్మెల్యే రాందాస్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఎర్రబెల్లి పైనా కేసులు బుక్‌ అయ్యాయి. బైక్‌పై తిరుగుతూ ప్రచారం చేశాడని కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌పై మధురానగర్‌ పీఎస్‌లో కేసు రిజిస్టర్‌ అయింది.

3. వెలుగులోకి వచ్చిన ఉగ్ర కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఉగ్ర కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఉగ్ర కుట్రకు కీలక సూత్రధారిగా వ్యవహరించాడు రాజేంద్ర నగర్‌కు చెందిన వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. డాక్టర్‌తో సహా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ముగ్గురిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దర్యాప్తు ముమ్మరం

4. నల్గొండలో నేడు కవిత జనం బాట

నల్గొండలో ఇవాళ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట నిర్వహించనున్నారు. అయితే రాత్రి నల్గొండ పట్టణంలో జాగృతి నాయకులు ఏర్పాటు చేసిన కవిత ఫ్లెక్సీలు, హోర్డింగులను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. రాత్రికి రాత్రే.. ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగించడంపై జాగృతి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

5. వాటర్‌ ఫాల్స్‌ను ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా దళాయివలస గ్రామంలోని ఆడపరాయి వాటర్‌ ఫాల్స్‌ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ ప్రాంతం.. ప్రకృతి అందాలతో నిండిన అపూర్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందగలదన్నారు. పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా.. సాలూరు పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధిలో దళాయివలస వాటర్‌ ఫాల్స్ కీలక పాత్ర పోషించనుందన్నారు.

6. తిరుమల పరకామణి చోరీ కేసులో కొనసాగుతున్న విచారణ

తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ కొనసాగుతున్నది. సీఐడీ డీజీ రవిశంకర్‌ నేతృత్వంలో ఆరు రోజులుగా దర్యాప్తు జరుగుతోంది. అప్పటి టీటీడీ ఎస్టేట్‌ అధికారి మల్లిఖార్జునరావును విచారించారు. చిత్తూరు ఆర్డీవోను TTDలోకి డిప్యూటేషన్‌పై తీసుకుని ఎస్టేట్‌ అధికారిగా నియమించారు. పరకామణి డిప్యూటీ ఈవో పోస్టు ఖాళీగా ఉండటంతో అదనపు బాధ్యతలు అప్పగించిన సమయంలోనే పరకామణిలో చోరీ జరిగింది.

7. కీలక మలుపు తిరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారం..

తిరుపతి జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ వ్యవహారం మలుపు తిరిగింది. నిన్నటి వరకు మృతురాలు యమున భర్తగా చెప్పుకుంటున్న సూరిబాబు అసలు భర్తే కాదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అరకు పిక్నిక్‌కు అని చెప్పి సూరిబాబు మదనపల్లెకి తీసుకెళ్లాడని టుటౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు యమున పేరెంట్స్. దళారుల మద్య వివాదంతో ఈ కిడ్నీ రాకెట్ బయటపడింది.
మలుపు

8. అట్టహాసంగా ఆగిపోయిన వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు

అట్టహాసంగా ప్రారంభమైన వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు పడకేశాయి. సంవత్సర కాలంగా పనులు ఆగిపోవడంతో నిర్మాణం జరిగేనా అంటూ నగరవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2.32 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన స్మార్ట్ బస్ స్టాండ్ కోసం సెల్లార్ గుంతలు తవ్వడంతో, వరద నీరు చేరి చెరువును తలపిస్తోంది. నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆగిపోయిన పనులు

9. ఢిల్లీలో పేలుడు ఘటన తర్వాత అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీలో పేలుడు ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు, ఎయిర్‌ఫీల్డ్‌లు, వైమానిక దళ స్టేషన్ల వద్ద భద్రతా చర్యలు పెంచాలని ఆదేశించింది. 3రోజులపాటు ఎయిర్ పోర్టులలో అమలులో ఉండనున్నాయి.

10. ఫరీదాబాద్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ మాస్టర్ మైండ్ ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ అరెస్ట్

ఫరీదాబాద్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ మాస్టర్ మైండ్ ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైషే మహమ్మద్ లింక్‌తో వైద్య విద్యార్థుల బ్రెయిన్‌వాష్ చేస్తున్న ఇర్ఫాన్.. షాహిన్, ముజమ్మిల్, ఉమర్‌లతో దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేశాడు. ఈ మాడ్యూల్‌కు ఫైనాన్షియర్‌గా డాక్టర్‌ షాహిన్ ఉన్నారు. జైషే వీడియోలు, ఇంటర్నెట్ కాల్స్‌తో విద్యార్థులను ఉగ్రవాదం వైపు మలుచుకుంటున్నాడు.

11. ఫుట్బాల్ ప్రపంచకప్పు తన కెరీర్లో ఇదే చివరిది-రొనాల్డో

వచ్చే ఏడాది జరిగే ఫుట్బాల్ ప్రపంచకప్పే తన కెరీర్లో చివరిదని పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అన్నాడు. వచ్చే ప్రపంచకప్ నాటికి 41 ఏళ్లు వస్తాయని, కచ్చితంగా అదే చివరి కప్పు అవుతుందని అన్నారు. ఒకటి, రెండేళ్లలో కెరీర్ ముగిసే అవకాశం ఉందని రొనాల్డో చెప్పారు. ఈ టోర్నీలో అర్జెంటీనా స్టార్ లియొనల్ మెస్సికి కూడా ఇది ఆరో ప్రపంచకప్ కావడం విశేషం.
ఇదే చివరిది

12. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మండిపడ్డా పెద్దారెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. “తాడిపత్రిని జేసీ సామ్రాజ్యం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ భూకంపం సృష్టించినట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. ఫ్యాక్షన్ చేస్తా అన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ.. అవకాశం వస్తే తానేంటో చూపిస్తానని హెచ్చరించారు.

13. మన్యం జిల్లాలో లారీలో భారీ మంటలు..

మన్యం జిల్లా పార్వతీపురంలో లారీలో మంటలు చెలరేగాయి. లారీపై జేసీబీని తరలిస్తుండగా జేసీబీకి తగిలి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో లారీలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

14. నిర్మల్ పట్టణంలో మొసలి పిల్ల కలకలం..

నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రిపేట్ శివారులో ఉన్న ఖజానా చెరువు గట్టుపై మొసలి పిల్ల కలకలం రేపింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ చెరువు వద్దే తమ నిత్యావసరాలు తీర్చుకోవడం, స్నానాలు చేయడం వంటివి చేస్తుంటారు. మొసలి కనబడటంతో చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు తెలిపారు.

15. ప్రొద్దుటూరులో వైసీపీ నేతలు భారీ ర్యాలీ..

ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికి కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మూడు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని విమర్శించారు. అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు.

16. వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారి దర్శనాలు నిలిపివేత..

వేములవాడ రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా స్వామివారి దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తులు ఆలయంలోకి రాకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు. భక్తులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసి వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

17. కొత్తపేట సబ్‌స్టేషన్‌ విద్యుత్ సిబ్బందిపై చైతన్య పురి పోలీసులు దౌర్జన్యం..

హైదరాబాద్ కొత్తపేట సబ్‌స్టేషన్‌ విద్యుత్ సిబ్బందిపై చైతన్యపురి పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. గంజాయి కేసులో సాక్ష్యం కోసం విద్యుత్‌ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొడవకు జరిగిన దృశ్యాలను మరో ఉద్యోగి రికార్డు చేశారు. సాక్ష్యం పేరుతో నిర్దోషులపై దాడులు ఎందుకు అని ప్రశ్నిస్తూ.. సబ్‌స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.

18. ఎర్రకోట పేలుడు ఘటనా స్థలంలో 42 శాంపిల్స్‌ను ఫొరెన్సిక్ బృందం టెస్ట్

ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనా స్థలం నుంచి 42 వస్తువులను సేకరించారు ఫొరెన్సిక్ అధికారులు. ఇవాళ ల్యాబ్‌లో వారు పరీక్షలు జరుపనున్నారు. ఏ పేలుడు పదార్థాలు వాడారనేది నిర్ణయించేందుకు సేకరించిన 42 శాంపిల్స్‌ను ఫొరెన్సిక్ బృందం టెస్ట్ చేయనుంది.

19. ది రాజాసాబ్ ప్రయాణాన్ని ముగించిన కథానాయకుడు ప్రభాస్..

‘ది రాజాసాబ్’ ప్రయాణాన్ని ముగించారు కథానాయకుడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రమిది. భారీ హంగులతో, పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాతో సుదీర్ఘకాలంగా ప్రయాణం చేస్తూ వచ్చిన ప్రభాస్‌పై సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

20. అవకాశాల కోసం ఆరాటపడే తత్వం తనది కాదు-అను ఇమ్మాన్యుయేల్

అవకాశాల కోసం ఆరాటపడే తత్వం తనది కాదన్నారు సినీ నటి అను ఇమ్మాన్యుయేల్. కెరీర్ ఆరంభంలో చేసినట్లుగా.. ఇకపై రొటీన్ కమర్షియల్ చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన లవ్ స్టోరీ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీలో అను క్యామియో రోల్ కనిపించి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×