E-Paper
Advertisement

IND VS SA 2ND TEST: ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే టెస్ట్ సిరీస్ లో కీల‌క మార్పులు..లంచ్ కంటే ముందే టీ బ్రేక్‌..టైమింగ్స్ ఇవే

IND VS SA 2ND TEST: ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే టెస్ట్ సిరీస్ లో కీల‌క మార్పులు..లంచ్ కంటే ముందే టీ బ్రేక్‌..టైమింగ్స్ ఇవే
Advertisement

IND VS SA 2ND TEST:  దాదాపు నెల రోజులపాటు ఆస్ట్రేలియా గడ్డపై దుమ్ము లేపిన టీమిండియా, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో ఫైట్ కు సిద్ధమైంది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ లో పాల్గొన్న నుండి టీమిండియా. నవంబర్ 14వ తేదీ అంటే ఎల్లుండి నుంచి టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టులు మాత్రమే జరగనున్నాయి. అయితే మొదటి టెస్టులో ఎలాంటి మార్పులు లేవు కానీ, గౌహతి వేదికగా జరగబోయే రెండో టెస్టులో మాత్రం కీలక మార్పులు జరగనున్నాయి. లంచ్ బ్రేక్ కంటే ముందు టీ బ్రేక్ ఇవ్వనున్నారు.

Also Read: IPL 2026 Released Players List: 10 ఫ్రాంచైజీలు రిలీజ్ చేసేది ప్లేయ‌ర్లు వీళ్లే..లిస్ట్ లో ర‌షీద్‌, ష‌మీ కూడా?

లంచ్ కంటే ముందే టీ బ్రేక్

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( IND VS SA 2ND TEST) మధ్య నవంబర్ 22వ తేదీ నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ నేపథ్యంలో మొదట టీ బ్రేక్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం సమయంలో లంచ్ బ్రేక్ ఇస్తారు. సాధారణంగా అన్ని టెస్టుల్లో మొదట లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత టీ బ్రేక్ ఇస్తారు. అయితే గౌహతి వేదికగా జరిగే టెస్ట్ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులలో కీలక మార్పులు ఉంటాయట. అక్కడ తొందరగానే సూర్యుడు ఉదయిస్తాడు. నాలుగు గంటల సమయానికి కాస్త చీకటి పడుతుంది. దానికి తోడు చలికాలం కావడంతో, ఈవినింగ్ ఎక్కువగా మ్యాచ్ సాగదు.

చీకటి పడి బంతి కనిపించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఉదయం 9 గంటలకే మ్యాచ్ ప్రారంభమై, సాయంత్రం నాలుగు గంటలకే ఫినిష్ అవుతుంది. టాస్ ఎనిమిదిన్నర గంటలకు ఉంటుందన్నమాట. ఫస్ట్ సెషన్ 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఉదయం 11 గంటలకు టీ బ్రేక్ ఇస్తారు. సెకండ్ సెషన్ వచ్చేసరికి 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు ఉంటుంది. లంచ్ 1.20 PM గంటలకు ఉంటుంది. మూడవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయంలో టీ బ్రేక్ ఉండదు. సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ ఫినిష్ అవుతుంది.

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య షెడ్యూల్

Advertisement

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 14వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. రెండో టెస్టు నవంబర్ 22వ తేదీ నుంచి కొనసాగనుంది. ఇక ఈ టెస్టులు పూర్తయిన తర్వాత నవంబర్ 30వ తేదీ నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 6వ తేదీ వరకు ఈ సిరీస్ కొనసాగుతుంది. ఇక డిసెంబర్ 9వ తేదీ నుంచి 5 టీ20 ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇలా డిసెంబర్ 19వ తేదీ వరకు ఇండియాలోనే దక్షిణాఫ్రికా పర్యటిస్తుంది.

Also Read: Arshdeep Singh: రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్..మైలేజ్‌, ఫీచ‌ర్స్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×