Big Stories

CM Himanta Sarma Warning: పెళ్లి ఆలోచనుంటే ఇప్పుడే .. ఎన్నికల తర్వాత జైలుకే.. !

CM Himanta biswa sarma warning to AIUDF chief Badruddin Ajmal Right time for 2nd or 3rd marriage

- Advertisement -

CM Himanta Sarma Warning: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్. ట్రెండ్ చూసుకుని ప్రత్యర్థులపై కామెంట్స్ చేస్తారు. చాలామంది నేతలపై ఆయన నోరుపారేసు కున్నారు. ఆ తరహా విద్య ఆయనకు వెన్నుతో పెట్టిన విద్యగా చాలామంది నేతలు చెబుతారు. తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు హిమంత శర్మ.

- Advertisement -

ఎన్నికల వేళ యూనిఫాం సివిల్ కోడ్ అమలు విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ పార్టీ నేతపై నోరు జారారు సీఎం హిమంతశర్మ. సార్వత్రిక ఎన్నికల తర్వాత అస్సాంలో యూసీసీని అమలు చేసి తీరుతామన్నారు. ఎంపీ అజ్మల్ మరో మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఎన్నికల ముందే చేసుకోవాలన్నారు. ఆ తర్వాత చేసుకుంటే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వైఫ్ ఉండగానే మరో పెళ్లి చేసుకోవడం యూసీసీ ప్రకారం నేరమని, దీనికి జైలు శిక్ష తప్పదన్నారు.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాటల వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. అస్సాంలోని ధుబ్రి నుంచి అజ్మల్ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్‌పై సెటైర్లు వేశారు అజ్మల్. రకీబుల్ మాత్రం తనకు వయసైపోయిందని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈ వయస్సులో మరో మ్యారేజ్ చేసుకునేంత సామర్థ్యం తనకు ఉందన్నారు అజ్మల్.  ముఖ్యమంత్రి  శర్మకు ఇష్టలేకపోయినా తాను పెళ్లి చేసుకుంటానని మనసులోని మాట బయటపెట్టారు.

ALSO READ : బీజేపీపై ఆగ్రహం.. రౌడీలే ఎక్కువే, అందుకే సౌత్‌పై..

అజ్మల్ వ్యాఖ్యలపై సీఎం హిమంత బిశ్వ శర్మ రియాక్ట్ అయ్యారు. అజ్మల్.. ఇప్పుడు రెండు కాదు.. నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నా మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు. పిలిస్తే మ్యారేజ్‌కి వెళ్తానన్నారు. ఇప్పుడు ఇల్లీగల్ అని యూసీసీ అమల్లోకి వస్తే.. సెకండ్ మ్యారేజ్‌ని ఆపేస్తామన్నారు. ఆ చట్టం ప్రకారం అప్పుడు ఆయన్ని జైలుకి పంపిస్తామని హెచ్చరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News