Big Stories

Peru President: ఖరీదైన వాచ్ పెట్టుకుని దర్శనమిచ్చిన పెరూ అధ్యక్షురాలు.. ఐటీ సోదాలు

Raid on Peru President
Peru President

Raid on Peru President(Telugu news live): రాజకీయనేతలు అధికారంలోకి వచ్చాక ఆచితూచి మెదలాలి. ఎందుకంటే ఓ రాజకీయ నేతలపై సెలబ్రిటీపై ఉండే ఫోకస్ కంటే ఎక్కువే ఉంటుంది. వారు చేసే చిన్న చిన్న తప్పులే వారిని సమస్యల్లో చిక్కుకునేలా చేస్తాయి. ఇదే తరుణంలో తాజాగా పెరూ అధ్యక్షురాలు చిక్కుల్లో పడింది. తాను ధరించిన ఓ చిన్న వస్తువు తనను కష్టాల్లో చిక్కుకునేలా చేసింది.

- Advertisement -

పెరూ అధ్యక్షురాలు డైనా బులురెటే ధరించిన వాచ్ ప్రస్తుతం తనను వివాదాల్లోకి నెట్టింది. తాజాగా డైనా ఖరీదైన వాచ్ పెట్టుకుని ఓ కార్యక్రమానికి హాజరైంది. అయితే తాను ధరించిన వాచ్ బ్రాండెడ్ కంపెనీ అయిన రోలెక్స్‌ది. దీంతో ప్రెసిడెంట్ ధరించిన వాచ్ పై అందరి ఫోకస్ పడింది. ఈ తరుణంలో మీడియా దీనిపై కథనాలు రాసింది. దీంతో ప్రస్తుతం పెరూలో ఈ వార్త చర్చనీయాంశం అవుతుంది.

- Advertisement -

డైన అధ్యక్షురాలిగా ఎన్నిక కాకముందు ప్రజా రికార్డుల్లో ఆమెకు ఎటువంటి ఖరీదైన వాచ్‌లు, రోలెక్స్ వంటివి లేదని రికార్డుల్లో చూపెట్టింది. తాజాగా ఆమె ఈ వాచ్ ధరించడంతో దుమారం రేపుతోంది. దీంతో ప్రెసిడెంట్ నివాసంలో సోదాలకు దారి తీసింది. పెరూ దేశ అవినీతి నిరోధక శాఖ(ఐటీ) అధికారులు కోర్టు ఆదేశాల మేరకు లిమాలోని ప్రెసిడెంట్ డైనా అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించారు.

Also Read: దారుణం.. లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి!

ఈ తరుణంలో శనివారం డైనా అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించగా.. పలు ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. డైనాకు ముందు నుంచే ఈ ఖరీదైన వాచ్ ఉందా.. లేక ఆమె అధికారంలోకి వచ్చాక అవినీతికి పాల్పడ్డారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు, ఖరీదైన వాచ్ గురించి వార్తల్లోకి రావడంతో అనేక పుకార్లు వచ్చాయి. డైనా వద్ద కేవలం ఇది ఒక్కటి మాత్రమే కాదని.. అనేక లగ్జరీ వాచ్ లు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఐటీ శాఖ అప్రమత్తమై సోదాలు చేపట్టింది. ప్రస్తుతం సోదాలకు సంబంధించిన ఎటువంటి విషయాలు తెలియరాలేదు.

పెరూ అత్యున్నత న్యాయస్థానం నియమించిన 20 మంది పబ్లిక్ ప్రాసిక్యూర్ అధికారులు, 20 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. కాగా, డైనా పెరూ అధ్యక్షురాలిగా డిసెంబర్ 2022లో బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News