E-Paper
Advertisement

Jai Hanuman: జై హనుమాన్ అప్డేట్.. వీడియో రిలీజ్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ..

Jai Hanuman: జై హనుమాన్ అప్డేట్.. వీడియో రిలీజ్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ..
Advertisement
Jai Hanuman
Jai Hanuman

Jai Hanuman Prasanth Varma : కొన్ని సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిలుగుతాయి. మరికొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటాయి. అందువల్ల ఇక్కడ గమనించాల్సింది.. స్టార్ హీరోలు, బడ్జెట్‌లు కాదు.. కంటెంట్. కంటెంట్ బాగుంటే ఎలాంటి హీరోని అయినా, ఏ భాషనైనా ప్రేక్షకులు ఆదరిస్తారు.

ఈ సూత్రాన్ని సినీ ప్రముఖులు గట్టిగానే నమ్ముతారు. అయితే అలాంటిదే ఈ ఏడాది ప్రారంభంలో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది.

Advertisement

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. అదే సమయంలో స్టార్ హీరో మూవీస్ విడుదల అయినా.. వాటన్నింటిని వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీ కలెక్షన్ల సునామి సృష్టించింది. బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి అదరగొట్టేసింది.

Also Read: టిల్లు గాని డీజే బాక్సాఫీసు వద్ద భలే సౌండ్ వస్తోంది బాసు.. రెండు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..?

Advertisement

తెలుగులోనే కాకుండా నార్త్‌లో సైతం హనుమాన్ తన హవా చూపించింది. దీంతో ఈ మూవీ సూపర్ హిట్ అందుకోవడంతో దీనికి సీక్వెల్‌ను కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించేశాడు. ‘జై హనుమాన్’ పేరుతో సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. అయితే దీనికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్‌ను ప్రశాంత్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించాడు.

ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో.. ఒక సముద్రం.. అందులో ఎత్తైన కొండలు.. ఆ కొండల మధ్య కొన్ని పడవలు కనిపించాయి. అయితే ఈ వీడియో రిలీజ్ చేస్తూ ప్రశాంత్.. వెల్‌కమ్ టు అంజనాద్రి 2.O! అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీని బట్టి చూస్తే ‘జై హనుమాన్’ మూవీ అంజనాద్రిలో రూపొందిస్తున్నట్లు అర్థం అవుతుంది.

ఇక ఈ మూవీని ఎంతో ప్రతిష్మాత్మకంగా తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. కాగా ఇందులో రాముడిగా మహేశ్ బాబు, హనుమంతుడిగా మెగాస్టార్ చిరంజీవితో చేస్తే బాగుంటుందని ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. మరి దీనికోసం వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఈ అప్డేట్ సినీ ప్రియుల్లో ఒకింత జోష్‌ని నింపింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×