E-Paper
Advertisement

సీఎం అయితే కోట్ వేసుకోకూడదా? విమర్శకులకు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!

సీఎం అయితే కోట్ వేసుకోకూడదా? విమర్శకులకు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్న విజయ్.. తాజాగా తన దుస్తులపై వస్తున్న విమర్శలకు గట్టిగానే సమాధానమిచ్చారు. రాజకీయ నాయకుడంటే ఇలాగే ఉండాలనే పాత చింతకాయ పచ్చడి రూల్స్‌ను పక్కనపెట్టి, తనదైన స్టైల్‌తో ప్రజల్లోకి వెళ్తున్నారు.

కోట్ వేసుకుంటే తప్పేంటి?

Advertisement

ఇటీవల ఆయన వేసుకుంటున్న సూట్, కోట్‌లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై విజయ్ స్పందించారు. ‘ముఖ్యమంత్రి అయితే కోట్ సూట్ వేసుకోకూడదా? నా సూట్‌ను కూడా విమర్శిస్తున్నారు. మన హృదయాల లాగే నేను కూడా బ్లాక్ అండ్ వైట్ రంగులనే ధరిస్తున్నాను. విజయ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్‌గా (అంటే చాలా నిజాయితీగా, ఓపెన్‌గా) ఉంటాడనే దానికి ఇదే నిదర్శనం’ అంటూ విమర్శకుల నోళ్లు నొక్కేశారు.

సీఎం కాదు.. ప్రజల సేవకుడిని

Advertisement

తాను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నంత మాత్రాన పాలకుడిలా ప్రవర్తించనని, ఎప్పటికీ ప్రజలకు సేవకుడిగానే ఉంటానని విజయ్ స్పష్టం చేశారు. ఇన్నేళ్లుగా తమిళనాడును మభ్యపెడుతూ, మోసం చేస్తూ వచ్చిన డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) పార్టీలకు గత ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు.

పోటీ ఇకపై ఆ రెండు పార్టీల మధ్యే!

భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు తమ వైపే ఉంటారనే నమ్మకాన్ని విజయ్ వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అసలైన పోటీ కేవలం డీఎంకే (DMK), తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీల మధ్యే ఉంటుందని, మూడో పార్టీకి ఇక్కడ స్థానం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. విజయ్ మాటలు చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ పాలిటిక్స్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×