E-Paper
Advertisement

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ
Advertisement

Psychological Thriller: ఒక్కరోజు చేతిలో ఫోన్ లేకపోతే అల్లాడిపోయే తరం మనది. కనీసం కాసేపు కరెంట్ పోయినా తట్టుకోలేము. కాకపోతే ఆ కాసేపు ఫోన్ ను పక్కన పెట్టి బయట ప్రపంచం చూడాలి అనుకుంటాము. కానీ ఒకే రూమ్ లో టీవీ, ఫోన్ లేకుండా ఉండాలంటే ఎన్ని రోజులు ఉంటాము ? అన్నీ వసతులు ఉన్నప్పటకీ అలా ఉండడం కష్టమే. మరి డబ్బులు ఇస్తామంటే… కొంతమంది ట్రై చేస్తారేమో. కానీ ఎన్ని రోజుల అలా ఉండగలరు ? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ‘ది ఇమ్మాక్యులేట్ రూమ్’ (The Immaculate Room 2022) అనే సినిమాను చూడాల్సిందే. 50 రోజులు ఒకే రూమ్ లో ఉంటే 5 మిలియన్ డాలర్లు అనే క్రేజీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమాలో హీరో హీరోయిన్ పేరు మైక్, కేట్. ఈ యంగ్ కపుల్ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతారు. ఆ సమస్యలు తిరడానికి ఈ జంట ఒక వింత ఎక్స్‌పెరిమెంట్‌లో పాల్గొనడానికి ఒప్పుకుంటారు. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా, ఈ భార్యాభర్తలు మాత్రమే 50 రోజులు గడపాలి. ఒక్కో రూల్ బ్రేక్ చేసినకొద్ది ప్రైజ్ మనీ తగ్గుతుంది. ఇద్దరూ తప్పుకుంటే ఏమీ రాదు.

Advertisement

మొదట కొన్ని రోజులు ఇద్దరూ చాలా సంతోషంగా గడుపుతారు. మంచి ఆహారం, వ్యాయామం చేస్తూ సమయాన్ని గడుపుతారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, ఆ గదిలోని నిశ్శబ్దం, ఒంటరితనం వాళ్ళను మెంటల్ టార్చర్ చేస్తుంది. బోర్ కొడుతున్న సమయంలో కంప్యూటర్ వాయిస్ వాళ్ళకి కొన్ని ఆఫర్లు ఇస్తుంది. తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయవచ్చు, కానీ అందుకు ప్రైజ్ మనీ నుండి కొంత మొత్తం కట్ అవుతుంది. మైక్ తన బోర్డం తట్టుకోలేక లక్ష డాలర్లు తగ్గించుకుని ఒక ‘గ్రీన్ క్రేయాన్’ కొని గోడలపై బొమ్మలు గీస్తూ కాలక్షేపం చేస్తాడు.

కేట్ మాత్రం ఒక్క రూపాయి కూడా వృధా చేయకూడదని పట్టుదలతో ఉంటుంది. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఆ రూమ్ వాళ్ళ సహనాన్ని పరీక్షించడానికి ఇంకొన్ని కఠినమైన పరీక్షలు పెడుతుంది. ఒక రోజు ఆ ప్రైజ్ మనీ నుండి భారీ మొత్తం కట్ చేసి, గదిలోకి ఒక నగ్న యువతిని పంపిస్తారు. ఆమె రాకతో మైక్, కేట్ ల మధ్య నమ్మకం దెబ్బతింటుంది. మైక్ పిచ్చివాడిలా ప్రవర్తిస్తుంటాడు.

Advertisement

ఆ తరువాత మైక్ భరించలేక ఆ గది నుండి బయటకు వెళ్ళిపోతాడు. కేట్ ఒంటరిగానే ఆ గదిలో మిగిలిపోతుంది. చివరికి ఆమె ఆ 50 రోజులు పూర్తి చేసి ప్రైజ్ మనీ గెలుచుకుందా లేదా ? ఒంటరిగా ఆ గదిలో ఆమె పడిన కష్టాలు ఏంటి ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులో లేదు

హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఇమ్మాక్యులేట్ రూమ్’. ఎమిల్ హిర్ష్, కేట్ బోస్వర్త్ నటించిన ఈ చిత్రం మనిషి మనసు ఎంత బలహీనమైనదో, డబ్బు కోసం ఎంతవరకు వెళ్తారో చూపించే మైండ్ బ్లోయింగ్ మూవీ. ప్రస్తుతం Netflix, Amazon Prime Videoలలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ తెలుగులో అందుబాటులో లేదు.

Read Also: 40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

Tags

Related News

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×