E-Paper
Advertisement

అయ్య బాబోయ్ డబ్బే డబ్బు.. ఏకంగా రూ. 4 కోట్ల హవాలా మనీ, ఎక్కడి నుంచి ఎక్కడకంటే..

అయ్య బాబోయ్ డబ్బే డబ్బు.. ఏకంగా రూ. 4 కోట్ల హవాలా మనీ, ఎక్కడి నుంచి ఎక్కడకంటే..
Advertisement

Raipur: వివిధ రాష్ట్రాల ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నగదు కట్టలు అప్పుడే తరలిపోతున్నాయి. పోలీసులు తనిఖీల్లో భాగంగా పికప్ వాహనం నుంచి దాదాపు రూ. 4 కోట్ల హవాలా మనీ బయటపడింది. నోట్ల కట్టలు చూసి అధికారులు షాకయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌లో వెలుగు చూసింది. అసలు ఏం జరిగింది?

రాయ్‌పూర్ తరలిపోతున్న నోట్ల కట్టలు

త్వరలో నాలుగైదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పొత్తులు, సీట్ల పంపకాల్లో పార్టీలు బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు నగదు తరలిపోతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఆదివారం రాత్రి పోలీసులు ఓ పికప్ వాహనం నుండి దాదాపు రూ. 4 కోట్ల నగదు సీజ్ చేశారు. డబ్బు తరలింపుకు పికప్ వాహనం వెనుక భాగంలోని ఓ రహస్య గదిలో దాచి ఉంచినట్లు గుర్తించారు.

వాహనంలోని సీక్రెట్ గదిలో పట్టుబడిన రూ. 4 కోట్లు

Advertisement

ఆ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాయ్‌పూర్ నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న హవాలా మనీగా అనుమానిస్తున్నారు.  యూపీకి వెళ్తుందని ఇలా రకరకాల అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో సొమ్ము తరలించడం వెనుక కారణాలేంటి? ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన ఖుర్సిపర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్రపారాలో వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి సుమారు 11 గంటలకు ఖుర్సిపర్ పోలీసులకు మనీ తరలింపు వ్యవహారంపై సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో CG 04 QU 5996 రిజిస్ట్రేషన్ నంబర్ గల తెల్లటి బొలెరో మాక్స్ పికప్ వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు ఈ నగదు బయటపడింది.

Advertisement

ALSO READ: హోసూరులో దారుణం.. ప్రియురాలి గొంతు కోసి .. ఆపై లారీ కింద పడి ప్రియుడి సూసైడ్!

వాహనంలోని ఇద్దరు వ్యక్తులు భావేశ్‌భాయ్ జినాభాయ్ దాభి, విష్ణుదేవ్ దుబేగా గుర్తించారు. పట్టుబడిన సొమ్మును ఆదాయపు పన్ను శాఖకు పంపడానికి అధికారులు రెడీ అయ్యారు. పట్టుబడిన అక్రమ మనీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Related News

హోటల్ గదిలో నవ వధువు మృతి.. 6 సెకన్లు ఏం జరిగింది? సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

హోసూరులో దారుణం.. ప్రియురాలి గొంతు కోసి .. ఆపై లారీ కింద పడి ప్రియుడి సూసైడ్!

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్యకు కేవలం రూ.500 జరిమానా.. హైకోర్టు షాకింగ్ తీర్పు

రాహుల్‌కు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని వాహనాలు ఢీ, పలువురికి గాయాలు

అప్పులు తీర్చి, గర్ల్‌ఫ్రెండ్‌తో తిరిగేందుకు.. కిడ్నాప్ డ్రామా ఆడిన నీట్‌ స్టూడెంట్!

గుట్కా ఉమ్ముతూ విద్యుత్ వైర్లపై.. బాల్కనీలో అసలు ఏం జరిగింది? మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

ఘోరమైన యాక్సిడెంట్.. లోయలోపడిన బస్సులో 30 మంది, వీడియోలో కాపాడాలంటూ ఆర్తనాదాలు

Big Stories

Advertisement
×