Influencer Suicide: దేశంలో ఆత్మహత్య పరంపర కొనసాగుతోంది. కారణాలు ఏమైనా కావచ్చు. చివరకు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తమిళనాడులో ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ హరీష్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వేధింపుల కారణంగా తన కొడుకు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకున్నాడన్నది తండ్రి ఆరోపణ. అసలు ఏం జరిగింది?
చెన్నైలోని సోషల్ మీడియా ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ హరీష్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఆయన వయస్సు కేవలం 27 ఏళ్లు. సోషల్ మీడియాలో ఆయనకు 13 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల్లో ‘ఫైనాన్స్ విత్ హరీష్’ పేరిట ఛానెల్ నడిపేవాడు. కేవలం ఆర్థిక, ఫైనాన్స్‌కు సంబంధించి రకరకాల విశ్లేషణలు చేసేవాడు. చెన్నైలోని ఓ విల్లాలో అద్దెకు ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలీదుగానీ, మంగళవారం ఉరి వేసుకున్నాడు.
ఈ విషయం తెలియగానే హరీష్ తండ్రి షాకయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి కొడుకు గురించి తెలిసిన కొన్ని విషయాలు ఆయన బయటపెట్టారు. వెంచర్ స్టూడియో సీఈఓ జేసన్ శామ్యూల్ తన కొడుకుని వేధించారని మృతుడి తండ్రి ఆరోపించారు. తన కొడుకును లక్ష్యంగా చేసుకుని సైబర్ బుల్లింగ్‌కు పాల్పడ్డారని ప్రస్తావించారు. ఈ వివాదం కారణంగా తన కొడుకు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడని చెప్పారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శామ్యూల్ ఆరోపణల క్రమంలో మెటా సంస్థ హరీష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిలిపి వేసిందని వివరించారు. ఈ ఘటన జరిగిన తర్వాత కొత్త ఖాతా ద్వారా వీడియోలు హరీష్ విడుదల చేసేవాడని తండ్రి పేర్కొన్నారు.
ALSO READ: మోదీ సర్కార్‌ని కూల్చేందుకు కుట్ర.. దసరా వేళ భగవత్ హాట్ కామెంట్స్, పశ్చిమం నుంచి తుఫాను మొదలు
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తన కుమారుడి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మరోవైపు హరీష్ ఆత్మహత్యపై సీఈఓ జేసన్ శామ్యూల్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. హరీష్ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, హరీష్‌ను వేధింపులకు గురి చేయలేదన్నారు. ఆయన వెల్లడించిన కొన్ని విషయాలకు సంబంధించి తప్పులు ఎత్తిచూపానని రాసుకొచ్చారు. హరీష్‌కు సెబీ గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ లైసెన్స్ లేదని పేర్కొన్నారు. తనకు ఏఎంఎఫ్‌ఐ లైసెన్స్ ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేశారని ప్రస్తావించారు. హరీష్ కొద్దిరోజుల కిందట అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నుంచి ఏఆర్‌ఎన్ నంబర్ పొందారని వివరించారు.