E-Paper
Advertisement

మోదీ సర్కార్‌ని కూల్చేందుకు కుట్ర.. దసరా వేళ భగవత్ హాట్ కామెంట్స్, పశ్చిమం నుంచి తుఫాను మొదలు

మోదీ సర్కార్‌ని కూల్చేందుకు కుట్ర.. దసరా వేళ భగవత్ హాట్ కామెంట్స్, పశ్చిమం నుంచి తుఫాను మొదలు
Advertisement

Mohan Bhagwat: దసరా పండుగ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఎదుగుతున్న తీరును జీర్ణించుకోలేని కొన్ని రాక్షస శక్తులు మోదీ సర్కార్‌ను కూల్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా.. పాలనలో మార్పు తీసుకురావడానికి కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.

మోదీ సర్కార్‌ని కూల్చే కుట్ర జరుగుతోంది-ఆర్ఎస్ఎస్ చీఫ్

నిరసనలు చేయడం ప్రజాస్వామ్య హక్కు అని, అవి రాజకీయ సాధనాలుగా మారినప్పుడు ఏం జరుగుతుంది? అని ప్రశ్నించారు. విజయదశమి సందర్భంగా నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన కోసం కాకుండా పరిష్కారాల కోసం ఆందోళన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతర్గత విభేదాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్న శక్తులను హెచ్చరించారు ఆయన.

దసరా వేళ మోహన్ భగవత్ హాట్ కామెంట్స్

Advertisement

నీట్-యూజీ పేపర్ లీక్‌, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ- SIR పై నిరసనలు జరుగుతున్న క్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిరసనల వల్ల శత్రుత్వం లేదా విభేదాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఆందోళనలు చేస్తున్న బృందాలు-ప్రభుత్వం-పరిపాలన యంత్రాంగం, రాజకీయ నాయకులతో సహా అన్ని వర్గాలపై ఉందన్నారు.

పశ్చిమం నుంచి తుఫాను మొదలు

దేశాన్ని బలహీన పరచాలని చూస్తున్న శక్తులు అస్థిరతను సృష్టించడానికి వివిధ మార్గాలను ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. అదే సమయంలో పశ్చిమ దేశాల గురించి నోరు విప్పారు. ఫ్రాన్స్, అల్బేనియాల్లో పాఠశాల సంస్కరణల పేరిట యువత నిరసనలను ప్రస్తావించారు. సాంస్కృతిక, సామాజిక విలువలను కూల్చివేయడానికి పశ్చిమ దేశాల నుంచి తుఫాను మొదలైందని హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాల వెనుక ఉన్న శక్తులు ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రభావాన్ని విస్తరించుకుంటూ ఇప్పుడు భారత్ వైపు దృష్టి సారించాయని ఆరోపించారు.

Advertisement

ALSO READ: పెళ్లైన జంట.. భర్త ముందే భార్యపై 8 మంది, బీహార్‌లో షాకింగ్ ఘటన

గడిచిన నాలుగైదు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందో చూడాలన్నారు. ఫ్రాన్స్, అల్బేనియాలో ఏం జరుగుతోంది? బంగ్లాదేశ్‌, నేపాల్‌లో ఏం జరిగింది? గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తున్న శక్తుల విస్తృత ప్రయత్నాలలో భాగమన్నారు. ప్రభుత్వాన్ని మార్చితే పరిస్థితి మారుతుందని అనుకుంటారని, అలా ఎప్పుడూ జరగలేదని కుండ బద్దలు కొట్టేశారు. కొన్ని శక్తులు దేశాన్ని-హిందువులను-ఆర్‌ఎస్‌ఎస్‌ను విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల గల వ్యక్తులు, ఆశావహ రాజకీయ నాయకుల మద్దతును పొందుతున్నారని వ్యాఖ్యానించారు.

Related News

పెళ్లైన జంట.. భర్త ముందే భార్యపై 8 మంది, బీహార్‌లో షాకింగ్ ఘటన

యూకో బ్యాంక్‌లో జాబ్స్.. మొత్తం 530 ఉద్యోగ ఖాళీలు.. ఫ్రెషర్స్‌కు మంచి ఛాన్స్

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఏం జరిగింది.. పారిపోతున్న వ్యక్తిని పట్టేశారు, అసలు గుట్టు బయటకు

కొండ చిలువల తోక పట్టుకుని రీల్స్.. వైరల్ కావడానికి ఏమైనా చేస్తేస్తారా?

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో.. ముగ్గురు నిందితులు అరెస్ట్!

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

Big Stories

Advertisement
×