E-Paper
Advertisement

చదువుకున్న స్కూల్‌లోనే దారుణం.. ప్రిన్సిపల్‌పై మాజీ స్టూడెంట్స్ దాడి.. పాఠశాల డబ్బుతో జంప్!

చదువుకున్న స్కూల్‌లోనే దారుణం.. ప్రిన్సిపల్‌పై మాజీ స్టూడెంట్స్ దాడి.. పాఠశాల డబ్బుతో జంప్!
Advertisement

Principal Attack: జార్ఖండ్ లోని ఖుంటి జిల్లాలో ఓ స్కూల్ ప్రిన్సిపల్ పై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ప్రిన్సిపల్ పై హత్యాయత్నం చేసింది.. సదరు స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులేనని పోలీసులు వెల్లడించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే..

ఖుంటి జిల్లాలోని సెయింట్ మైఖేల్ చర్చికి అనుబంధంగా ఉన్న ఆర్‌సీ బాయ్స్ మిడిల్ స్కూల్లో ఫాదర్ బేనెడిక్ట్ బార్లా ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల ఆయనపై కొందరు దాడి చేశారు. అయితే ఇది చేసింది ఆయన పనిచేస్తున్న స్కూల్లోని పూర్వ విద్యార్థులేనని వెల్లడైంది. స్థానికంగా జరుగుతున్న జాతరకు వెళ్లేందుకు నిందితులకు డబ్బులు అవసరమైంది. దీంతో చోరీ చేసేందుకు అర్ధరాత్రి పాఠశాలలోకి రహస్యంగా ప్రవేశించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఫాదర్ బేనెడిక్ట్ బార్లా అక్కడకు రావడంతో నిందితులు భయపడిపోయారు. తాము దొరికిపోతామన్న కంగారులో వారిలో ఒకరు చిన్న పార లాంటి ఆయుధంతో ఫాదర్‌పై విక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఫాదర్ నుదురు, కణత భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి.

నిందితులు 15 ఏళ్ల లోపు వారే..

Advertisement

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, మొబైల్ టవర్ డేటా ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు బాలురు 13, 14, 15 సంవత్సరాల వయస్సు వారే కావడం గమనార్హం. పరారీలో ఉన్న నాలుగో నిందితుడి వయస్సు, దాడి ఘటనలో అతడి పాత్ర అతడి అరెస్టు తర్వాతే తేలుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రిన్సిపల్ పై దాడి అనంతరం దోచుకెళ్లిన డబ్బులో రూ. 85,747 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మెుబైల్ ఫోన్స్, దొంగిలించిన డబ్బుతో కొన్న వస్తువులను సీజ్ చేశారు.

దాడి రోజు ఏం జరిగిందంటే?

అక్టోబర్ 20వ తేదీ రాత్రి సుమారు 8:30 గంటల ప్రాంతంలో ఈ నలుగురు నిందితులు స్కూల్ ఆవరణలోకి చొరబడ్డారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఫాదర్ బార్లాను చూసి నిందితులు అడ్డుకోబోగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఒక మైనర్ ఆయుధంతో దాడి చేయడంతో ఫాదర్ కుప్పకూలిపోయారు. అనంతరం వారు స్కూల్ ఆఫీసులో విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. దాదాపు అర్ధగంట పాటు ఈ తంతు జరిగింది. మరుసటి రోజు ఉదయం (అక్టోబర్ 21) ఫాదర్ బార్లా పాఠశాల క్యాంపస్‌లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆయన్ను రాంచీలోని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అక్కడ ఆయనకు చికిత్స అందుతోంది.

Advertisement

Also Read: మైనింగ్‌లో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్ డెడ్.. హోంమంత్రి కీలక ఆదేశాలు!

దాడిపై ప్రజా ఆగ్రహం

ఫాదర్ బార్లాపై జరిగిన ఈ అన్యాయమైన దాడిని ఖుంటి జిల్లా ప్రజలు, క్రైస్తవ సంఘాల సభ్యులు తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దర్యాప్తులో దూకుడు ప్రదర్శించి.. నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతో స్థానికులు, క్రైస్తవ సంఘాలు శాంతించాయి.

Also Read: వాట్సప్, టెలిగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి ఆ రూల్స్ నిజమేనా? కేంద్రం క్లారిటీ!

Tags

Related News

‘అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు’.. చైనా వ్యూహంపై కేంద్ర మంత్రి సెటైర్లు!

కర్ణాటక ‘స్టింగ్ ఆపరేషన్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. సీఎం డీకే శివకుమార్ సంచలన విషయాలు వెల్లడి!

ప్రపంచ శాంతికి వేదిక యూఎన్.. అయినా యుద్ధాలు ఎందుకు ఆగడం లేదు?

చిరిగిన రూ.10 నోటు వివాదం.. డెలివరీ బాయ్‌పై కస్టమర్ దాడి.. అవమానంతో యువకుడు సూసైడ్!

‘దేశ ప్రతిష్టను తాకట్టు పెడుతున్నారు’.. రాహుల్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ!

డేంజర్ బెల్స్.. ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి హెచ్చరిక!

ఆడి కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి, బాధితుడ్ని తొక్కుకుంటూ వెళ్లిన డ్రైవర్!

Big Stories

Advertisement
×