E-Paper
Advertisement

మైనింగ్‌లో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్ డెడ్.. హోంమంత్రి కీలక ఆదేశాలు!

మైనింగ్‌లో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్ డెడ్.. హోంమంత్రి కీలక ఆదేశాలు!
Advertisement

Pinakota Blast: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం పినకోట ప్రాంతంలోని మైనింగ్ పరిధిలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘోర ప్రమాదంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

డీజిల్ నింపుతుండగా భారీ పేలుడు

రోడ్డు నిర్మాణ పనుల కోసం మైనింగ్ ప్రాంతానికి జిలెటిన్ స్టిక్స్ తీసుకెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనం నుంచి టిప్పర్‌లోకి డీజిల్ నింపుతుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో వాహనంలో ఉన్న జిలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలిపోవడంతో తీవ్రత పెరిగింది. పేలుడు దాటికి మృతదేహాలు చిన్నాభిన్నమై తీవ్ర భయాందోళన రేకెత్తించాయి. మండల కేంద్రానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరగ్గా.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

విధులకు వెళ్తూ ఉపాధ్యాయురాలు బలి

Advertisement

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో డ్రైవర్, ముగ్గురు కార్మికులతో పాటు ఒక ఉపాధ్యాయురాలు కూడా ఉన్నారు. రోజువారీ విధుల్లో భాగంగా పాఠశాలకు వెళ్లేందుకు బొలెరో వాహనంలో ప్రయాణిస్తుండగా టీచర్ సునీత ప్రమాదానికి గురై మృతిచెందారు. టీచర్ సునీత (విశాఖపట్నం)పాటు చనిపోయిన వారిని మణి (దేవరపల్లి), నారాయణరావు (చీడికాడ), పవన్ కుమార్ (కడప)గా గుర్తించారు. మరణించిన డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మరో ‘ఎపిక్ ఫ్యూరీ’కి సిద్ధం.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

అధికారులకు హోంమంత్రి కీలక ఆదేశాలు

Advertisement

పినకోట పేలుడు ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే అల్లూరి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేసిన మంత్రి.. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Also Read: కర్ణాటక ‘స్టింగ్ ఆపరేషన్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. సీఎం డీకే శివకుమార్ సంచలన విషయాలు వెల్లడి!

Tags

Related News

ఏపీకి ‘అర్ణబ్’ తుఫాను ముప్పు.. రేపటికి తీవ్ర వాయుగుండం.. డేంజర్ జోన్‌లో ఆ జిల్లాలు!

అసెంబ్లీ సైకిల్‌ది.. మున్సిపాలిటీ ఫ్యాన్‌దేనా? ఇచ్ఛాపురంలో పీఠం ఎవరిది?

స్థానిక సమరంలో హింసకు తావులేదు: ఏపీ డీజీపీ కీలక హెచ్చరిక

నామినేషన్ల గడువు 48 గంటలు పెంచాల్సిందే! ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్

మాజీ మంత్రిని తోసేసిన ఎస్‌ఐ.. చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత

విధ్వంసాలు వాళ్లు చేసి.. నిందలు మాపై నెడతారా? వైసీపీపై బొండా ఉమా ఆగ్రహం!

2028లో నాయకులను చెప్పులతో కొడతారు..జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×