BigTV English

Raw Cat Meat : ఐదురోజులుగా ఆహారం లేదు.. ఆకలిబాధ భరించలేక ఏం చేశాడంటే..

Raw Cat Meat : ఐదురోజులుగా ఆహారం లేదు.. ఆకలిబాధ భరించలేక ఏం చేశాడంటే..

Raw Cat Meat : కేరళలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా తిండిలేక ఆకలితో బాధపడుతున్న ఓ వ్యక్తి కడుపు మంట తీర్చుకోవడానికి చనిపోయిన పిల్లిని పీక్కుతింటూ కనిపించాడు. ఈ హృదయ విదారక దృశ్యం మలప్పురం జిల్లా కుట్టిపురం బస్టాండులో కనిపించడంతో స్థానికులు చూసి షాక్‌కి గురయ్యారు.


వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని ఆ యువకుడికి ఆహారం అందించి వివరాలు రాబట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని ధుబరీ జిల్లాకు చెందిన ఆ 27 ఏళ్ల యువకుడు అక్కడే ఓ కళాశాలలో చదువుతుండేవాడు. గతేడాది డిసెంబరులో ఇంట్లో నుంచి చెప్పకుండా రైల్లో కేరళకు వచ్చాడు.

డబ్బు లేకపోవడంతో ఐదురోజులుగా భోజనం చేయలేదని తెలిపారు. దీంతో ఆకలి బాధ తట్టుకోలేక చనిపోయిన ఓ పిల్లి కనిపించడంతో, దాని మాంసాన్ని పచ్చిగానే తింటూ స్థానికులకు కనిపించాడని చెప్పారు. పోలీసులు యువకుడి కుటుంబ సభ్యులను ఫోన్‌లో సంప్రదించి సమాచారం అందించారు. ఆ యువకుడిని ప్రభుత్వ మానసిక ఆసుపత్రి(Government Mental Hospital)లో చేర్పించినట్లు పోలీసులు వెల్లడించారు.


Tags

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×