E-Paper
Advertisement

Teja Sajja about HanuMan: హనుమాన్ సినిమా కోసం 75 సినిమాల్ని వదులుకున్నాను: తేజ సజ్జ

Teja Sajja about  HanuMan: హనుమాన్ సినిమా కోసం 75 సినిమాల్ని వదులుకున్నాను: తేజ సజ్జ
Advertisement

Teja Sajja about Hanuman Movie: సినీ ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు మారిపోతుందో చెప్పలేం. కొందరు ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ, మరికొందరు ఒకటి రెండు సినిమాలతోనే మంచి సక్సెస్ అందుకొని క్రేజ్ సంపాదించుకున్న వాళ్లు ఉన్నారు. అందులో ముందు వరుసలో యంగ్ నటుడు తేజా సజ్జ ఉంటాడు.

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన తేజ.. టాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోల చిత్రాల్లో చిన్నప్పటి పాత్రలు చేశాడు. అలాగే పెద్దయ్యాక.. ఓ బేబీ, జాంబీ రెడ్డి, అద్భుతం లాంటి సినిమాల్లో హీరోగా చేశాడు. అయితే ఈ సినిమాలతో పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు. ఇక ఇటీవల క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్‌’లో నటించాడు.

Advertisement

పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ కంటెంట్, గ్రాఫిక్స్‌తో ఆశ్చర్యానికి గురిచేసింది. పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగించింది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలు కావస్తున్నా.. ఇంకా అక్కడక్కడ రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. బాక్సాఫీసు వద్ద కళ్లు చెదిరే కలెక్షన్లను రాబట్టింది. దాదాపు రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళు చేసి రికార్డు సృష్టించింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్న తేజ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ‘హనుమాన్’ కోసం చేసిన త్యాగాల గురించి చెప్పుకొచ్చాడు. హనుమాన్ సినిమాను కంప్లీట్ చేయడానికి దాదాపు రెండేళ్లు పట్టిందని అన్నాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు వేరే సినిమాల వైపు అస్సలు దృష్టి పెట్టలేదని తెలిపాడు.

Advertisement

ఈ మూవీ చేస్తున్న సమయంలోనే తన వద్దకు దాదాపు 70 నుంచి 75 సినిమాలు వచ్చినట్లు తెలిపాడు. అయితే వాటన్నింటినీ తాను రిజక్ట్ చేసినట్లు చెప్పాడు. వీటిలో దాదాపు 15 స్టోరీలు తనను బాగా ఆకట్టుకున్నాయని అన్నాడు. అయితే హనుమాన్ మూవీకి బాగా కనెక్ట్ కావడంతోనే వాటన్నింటినీ రిజక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×