BigTV English

Shubman Gill: శ్రేయాస్ చెప్పకపోతే.. వెనక్కి వెళ్లిపోయేవాడిని: గిల్

Shubman Gill: శ్రేయాస్ చెప్పకపోతే.. వెనక్కి వెళ్లిపోయేవాడిని: గిల్

Shubman Gill: విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా సెంచరీ చేసిన శుభ్ మన్ గిల్ 4 పరుగుల వద్ద రివ్యూ తీసుకుని బతికి బయటపడ్డాడు. ఆ క్షణం రివ్యూ తీసుకోవాలని అనుకోలేదని, కానీ శ్రేయాస్ సలహా ఇచ్చాడని తెలిపాడు. నిజానికి సౌతాఫ్రికాలో జరిగిన మూడో టీ 20లో కూడా గిల్ ఇలాగే ఎల్బీడబ్ల్యూ అనేసరికి వెనక్కి వచ్చేశాడు.


అది దూరం నుంచి రాహుల్ ద్రవిడ్ చూసి, అదేమిటి రివ్యూ తీసుకోకుండా వచ్చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి ద్రవిడ్ చెప్పినట్టుగానే అది నాటౌట్ అని తేలింది. సరిగ్గా అదే పరిస్థితి రెండో టెస్ట్ లో కూడా ఎదురైంది. ఈ విషయంపై ద్రవిడ్ చూస్తూ, ఏమైందో చూడలేదని పక్కవాళ్లతో అన్నాడు. అయితే  సౌతాఫ్రికాలో చేసిన తప్పు, గిల్ ఇక్కడ చేయలేదు. కాకపోతే దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు.

నిజానికి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుందని మొదట భావించలేదని అన్నాడు. కానీ శ్రేయస్ అయ్యర్ అది చూశాడు. తనే సలహా ఇచ్చి, రివ్యూకి వెళ్లమని చెప్పాడు. అంపైర్ కాల్ అయినా ఫర్వాలేదు.. సమీక్ష కోరమని అన్నాడు. నా సందిగ్ధాన్ని తొలగించాడు. తనంత నమ్మకంగా చెప్పేసరికి, నేను కాదనలేక రివ్యూకి వెళ్లాను. మొత్తానికి నాటౌట్ అని తేలింది. హమ్మయ్యా అనుకున్నానని అన్నాడు.


నిజానికి శ్రేయాస్ రివ్యూ తీసుకోమని చెప్పకపోతే, పెవిలియన్ కి చేరిపోయేవాడినని అన్నాడు. ఈ సందర్భంగా తనకి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు. అయితే శ్రేయాస్ ఇక్కడ పరుగులు చేయకపోయినా, గిల్ కి సహాయపడటంపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రేయాస్ క్రీడాస్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు. ఈరోజున గిల్ చేసిన సెంచరీయే మ్యాచ్ పై పట్టు బిగించిందని అంటున్నారు. బయట జనం రకరకాలుగా అనుకుంటారు. కానీ జట్టు స్ఫూర్తిని దెబ్బతీయకుండా అందరూ కలిసికట్టుగా ఆడటం గొప్ప విషయమని అంటున్నారు.

గిల్ చివరిగా మాట్లాడుతూ సెంచరీ తర్వాత తన అవుట్ విషయంలో మాట్లాడుతూ పాయింట్ ఫీల్డర్‌ను చూసి ఆ షాట్ ఆడాను. కానీ కనెక్ట్ అవ్వలేదు. టీ విరామానికి అయిదు ఓవర్లు ముందు ఔటయ్యాను” అని గిల్ అన్నాడు.

Related News

Arjun Tendulkar: రహస్యంగా సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Dinda Academy Trolls : Dinda Academy అని ఎందుకు ట్రోలింగ్ చేస్తారు..?

Nithish Kumar Reddy : మహేష్ కోసం త్యాగం.. కొత్త టాటూలతో రెచ్చిపోయిన నితీష్ కుమార్ రెడ్డి

Rashid Khan : సరికొత్త షాట్ కనిపెట్టిన రషీద్ ఖాన్… చరిత్రలో నిలిచి పోవడం గ్యారెంటీ

Grace Hayden on Pant: రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురు మోజు.. బోల్డ్ కామెంట్స్ వైరల్ !

WI Beat Pak in ODI Series : పాకిస్తాన్ క్రికెట్ లో భూకంపం..5 గురు డకౌట్.. 34 ఏళ్ల తర్వాత ఓటమి

Big Stories

×