BigTV English

Kim Kardashian: అంబానీ పెళ్లిలో బారులు తీరిన జనం.. కిమ్ కర్దాషియన్ రాకతో హడావుడి!

Kim Kardashian: అంబానీ పెళ్లిలో బారులు తీరిన జనం.. కిమ్ కర్దాషియన్ రాకతో హడావుడి!

Kim Kardashian in Ananth Ambani wedding(Celebrity news today): దేశంలో అత్యంత సంపన్న కుటుంబం.. అంబానీల ఇంట పెళ్లి జరుగుతోంది. రిలియన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, అతని ప్రియురాలు రాధిక మర్చెంట్ కు శుక్రవారమే వివాహం. పెళ్లి వేడుక కోసం.. మీడియా, సినిమా, రాజకీయం, అంతర్జాతీయ సెలబ్రిటీలు, క్రికెటర్లు అందరూ పెళ్లి కోసం ముంబై చేరుకున్నారు. అనంత్ అంబానీ పెళ్లి జియో వరల్డ్ కన్వెన్షన్ లో జరుగుతోంది. ముఖ్యంగా అమెరికన్ ఫ్యాషన్ సెలిబ్రిటీ కిమ్ కర్దాషియన్.. ముంబై ఎయిర్ పోర్టు నుంచి తాజ్ మహల్ హోటల్ చేరుకున్నారు.


Also Read: నాలుగు దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న ‘పూరీ’ రత్నభాండాగారం

కర్దాషియన్ కోసం.. అంబానీలు ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే పెళ్లిలో అన్ని కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లికి సంబంధించిన ప్రతి సమాచారం.. మీడియా కవర్ చేస్తోంది. అంబానీ ఇంట పెళ్లికి పలు హాలీవుడ్ సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది. కిమ్ కర్దాషియన్ తో పాటు క్లో కర్దాషియన్ కూడా అంబానీ పెళ్లికి అతిథిగా వచ్చారు. వీరిద్దరికీ అనంత్ అంబానీ స్వయంగా ఆహ్వానించారని సమాచారం.


కిమ్ కర్దాషియన్ ముంబై ఎయిర్ పోర్టు చేరుకోగానే.. ఆమె కోసం జనాలు బారులు తీరారు. ఆమె కారు చుట్టూ పప్పారాజీ(అభిమానులు) చుట్టుముట్టిన దృశ్యాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇద్దరు కర్దాషియన్ సిస్టర్స్ కు భారతీయ సంస్కృతి శైలిలో తాజ్ మహల్ హోటల్ సిబ్బంది స్వాగతం పలికారు. ఇంతకు ముందు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో పాప్ స్టార్ రిహానా, జస్టిన్ బీబర్ లాంటి అంతర్జాతీయ సింగర్లు అతిథులను తమ సంగీతంతో అలరించారు.

Also Read: ‘దేశంలో నిరుద్యోగం మహమ్మారిలా మారిపోయింది.. బిజేపీ పాలిత రాష్ట్రాల్లో మరీఎక్కువ’

అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం మూడు రోజులపాటు జరుగుతుంది. పెళ్లిలో భాగంగా జూలై 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగల్ ఉత్సవ్ కార్యక్రమాలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. పెళ్లిలో అందరూ ఇండియన్ డ్రెస్ కోడ్ పాటించాలి.

 

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×