New Mobile Offer: చైనీస్ టెక్ మేకర్ షియోమీ తన సబ్ బ్రాండ్‌గా రెడ్‌మీని తీసుకొచ్చింది. ఈ బ్రాండ్‌కు మార్కెట్ చాలా మంచి పేరు ఉంది. రెడ్‌మీ నుంచి ఏదైనా ఫోన్ వస్తుందంటే మొబైల్ ప్రియుల్లో అటెన్షన్ ఉంటుంది. బడ్జెట్ ఫోన్లకు రెడ్‌మీ బాగా ఫేమస్ అయింది. మధ్య తరగతి ప్రజలకు కొనుగోలు చేసే విధంగా కంపెనీ ఫోన్లను పరిచయం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే రెడ్‌మీ తాజాగా మిడ్ రేంజ్ బడ్జెట్‌లో రెడ్‌మీ 13 5జీ విడుదల చేసింది.
ఈ కామర్స్ సైట్ అమోజాన్‌లో దీన్ని సేల్‌కు తీసుకొచ్చింది. ఈ ఫోన్ రెడ్‌మీ 12 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఆగష్టు 2023లో విడుదలైంది. రెడ్‌మీ 13 5జీ కార్నింగ్ గొరిల్లా బ్యాక్‌ను కలిగి ఉంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్ కలిగి ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: CMF Phone 1 Offers: బడ్జెట్ ఫ్లాగ్‌షిప్.. CMF ఫోన్‌పై ఆఫర్లు.. కొత్తగా ట్రై చేశారు!
రెడ్‌మీ 13 5జీ మొదటి సేల్ ఈ రోజు ప్రారంభమైంది. అమోజాన్‌లో ఫోన్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అలనే ఆఫర్లపై ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్‌లలో వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.13999, 15499గా ఉన్నాయి. అయితే మొదటి సేల్‌లో దీనిపై రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. మూడు కలర్స్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అందులో ఓషన్ బ్లూ, పెరల్ పింక్, మిడ్నైట్ బ్లాక్ ఉన్నాయి.
రెడ్‌మీ 13 5జీ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌తో వస్తాయి. ఈ ఫోన్‌లో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపిఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ 4 ఎన్ఎమ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ఎస్ఓసీ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. పవర్ కోసం 5030 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్స్ ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Also Read: Colour Changing Phone: కొత్త టెక్నాలజీ.. రంగులు మార్చే ఫోన్.. ధర కూడా తక్కువే!
రెడ్‌మీ 13 5G 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా 3x ఇన్-సెన్సర్ జూమ్‌ను అందిస్తుంది. ఫోన్‌లో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. వీడియో చాట్‌లు, సెల్ఫీల కోసం, ఇది 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఇదీ క్వాలిటీ పిక్చర్‌లను క్యాప్చన్ చేస్తుంది.