BigTV English

BJP’s Madhavi Latha: బీజేపీ నేత మాధవీలతకు షాక్‌.. హైకోర్టు నోటీసులు!

BJP’s Madhavi Latha: బీజేపీ నేత మాధవీలతకు షాక్‌.. హైకోర్టు నోటీసులు!

High Court Notices To BJP’s Madhavi Latha’s Virinchi Hospital: బీజేపీ నేత మాధవీలతకు బిగ్ షాక్‌ తగిలింది. మాధవీలతకు చెందిన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పెన్సన్ ఆఫీస్ దగ్గర ఉన్న విరించి ఆస్పత్రికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గత కొంతకాలంగా ఆస్పత్రిలోని వ్యర్థ పదార్థాలను నివాస ప్రాంతాల్లో గుంత తీసి అందులోనే పూడ్చుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ అభియోగాల కేసులో విరించి ఆస్పత్రికి నోటీసులు ఇచ్చింది.


విరించి ఆస్పత్రికి వ్యతిరేకంగా ఖైరతాబాద్‌కు చెందిన రిజ్వాన్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం చర్యలకు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా..ప్రభుత్వ వాదనల తర్వాత ఆ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.

ఆస్పత్రిలోని వ్యర్థాలను నివాస ప్రాంతంలో గుంత తీసి కప్పివేస్తున్నారనే కేసులో ఆస్పత్రి యజమాని, బీజేపీ నేత మాధవీలతకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఇందులో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ, కాలుస్య నియంత్రణ మండళ్లకు సైతం నోటీసులు పంపింది.


తన ఇంటి పక్కనే గుంతలు తీసి ఆస్పత్రి వ్యర్థాలను పూడ్చుతున్నారని రిజ్వాన్ ఖాన్ పిటిషన్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారించింది.

Also Read: త్వరలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాధవీలత..హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఓవైసీపై పోటీ చేయడంతో రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చింది. పాతబస్తీలో దొంగ ఓట్ల నియంత్రణపై కీలకంగా పనిచేసింది. దీంతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ నేతలపై విమర్శలు చేస్తూనే ప్రజలకు దగ్గరైంది.

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×