BigTV English

Rahul Gandhi: ‘దేశంలో నిరుద్యోగం మహమ్మారిలా మారిపోయింది.. బిజేపీ పాలిత రాష్ట్రాల్లో మరీఎక్కువ’

దేశంలో నిరుద్యోగ సమస్య మహమ్మారిలా తీవ్ర రూపం దాల్చిందని. బిజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi: ‘దేశంలో నిరుద్యోగం మహమ్మారిలా మారిపోయింది.. బిజేపీ పాలిత రాష్ట్రాల్లో మరీఎక్కువ’

Rahul Gandhi latest news(Political news telugu): దేశంలో నిరుద్యోగ సమస్య మహమ్మారిలా తీవ్ర రూపం దాల్చిందని. బిజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.


ఇటీవల గుజరాత్ , భారూచ్ జిల్లాల్లో అంకలేశ్వర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీ 40 ఉద్యోగుల భర్తీ కోసం వాక్ ఇన్ ఇంటర్‌వ్యూలు నిర్వహించింది. ఈ 40 ఖాళీల కోసం 800 మంది యువకులు ఇంటర్‌వ్యూ కోసం వచ్చారు. ఒక ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన ఈ ఇంటర్‌వ్యూకు వెళ్లాలంటే.. హోటల్ బయట లైన్ లో నిలబడి ఉండాలి. అలా హోటల్ ద్వారం వరకు చేరుకోవడానికి లైన్ లో ఉన్న వందల మంది యువకుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో చాలా మంది విద్యార్థులు ద్వారం వద్ద ఉన్న రేలింగ్ విరిగి కిందకు పడిపోయారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ కొందరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: ‘ముస్లిం మహిళలకు విడాకుల భరణం’.. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేస్తూ పిటీషన్!


ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ట్వట్ చేశారు. “దేశంలో నిరుద్యోగం అనే వ్యాధి మహమ్మారిలా తీవ్ర రూపం దాల్చింది. బిజేపీ పాలిత రాష్ట్రాలే ఈ మహమ్మారికి కేంద్రంగా మారాయి. దేశ భవిష్యత్తు అయిన యువత ఒక సాధారణ ఉద్యోగం కోసం ఇలా లైన్ లో నిలబడి ఉండడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న అమ్రిత్ కాల్ (మంచి రోజులు). ఇది కళ్ల ముందున్న వాస్తవం.” అని ట్విట్టర్ -x లో రాశారు.

రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ సంఘటనను ఉదాహరణగా చూపుతూ బిజేపీపై మండిపడ్డారు.” గుజరాత్‌లో చీటింగ్ మాడల్ ఉందని చెప్పడానికి ఈ వీడియో ఆధారం. గత 22 ఏళ్లుగా బిజేపీ గుజరాత్ ప్రజల మోసం చేస్తోంది. మోదీ ప్రభుత్వం.. యువత నుంచి ఉద్యోగాలు లాక్కొని.. గత 10 సంవత్సరాలుగా వారి భవిష్యత్తుని నాశనం చేసిందని చెప్పేందుకు ఈ వీడియోనే ప్రూఫ్,” అని ఖర్గే ట్విట్టర్ లో పోస్టు చేశారు.

Also Read: స్కూల్ పిల్లల భోజనంలో బల్లి!.. 30 విద్యార్థులకు అనారోగ్యం.. కేంద్రం సీరియస్

“రెండు కోట్ల మందికి ప్రతీ సంవత్సరం ఉద్యోగాలు కల్పిస్తామని బిజేపీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ బిజేపీ పాలనలో పేపర్ లీక్, ఉద్యోగాల భర్తీలో అవినీతి, విద్యాసంస్థలో మాఫియా, ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలున్నా భర్తీ చేయడం లేదు. కావాలనే SC/ST/OBC/EWS కోటాలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. సైన్యంలో కూడా అగ్నివీర్ అంటూ కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తున్నారు. వీటన్నింటి వల్ల యువత ఉద్యోగాల కోసం రోడ్లపై తిరుగుతూ ఉంది.”, అన్ని ఖర్గే అన్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×