E-Paper
Advertisement

Vijayawada Crime: కూతురు కాపురానికి రాలేదని.. అత్తని హత్య చేసిన అల్లుడు, విజయవాడలో దారుణం

Vijayawada Crime: కూతురు కాపురానికి రాలేదని.. అత్తని హత్య చేసిన అల్లుడు, విజయవాడలో దారుణం
Advertisement

Vijayawada Crime: ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు అగాధాన్ని సృష్టిస్తున్నాయి. ఫలితంగా హత్యలు లేకుంటే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కూతుర్ని కాపురానికి పంపలేదన్న కోపంతో అత్తని నరికి చంపేశాడు అల్లుడు. సంచలనం రేపిన ఈ ఘటన విజయవాడ సిటీలో చోటు చేసుకుంది.

Advertisement

విజయవాడలో దారుణం

ఈ మధ్యకాలంలో చిన్నచిన్న సమస్యలు కుటుంబాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఆవేశానికి గురవుతున్నారు. హత్య చేయడం లేదంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా విజయవాడ సిటీలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

Advertisement

ఆ ప్రాంతంలో ఉండే కోలా దుర్గా కొద్దిరోజుల కిందట కూతురికి నాగ సాయికి ఇచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత కూతురు-అల్లుడు హ్యాపీగా ఉండేవారు. ఆ తర్వాత కాపురంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా నాగ సాయి దగ్గర నుంచి పుట్టింటికి వచ్చేసింది. చివరకు అల్లుడి వద్దకు వెళ్లేందుకు ముఖం చాటేసింది దుర్గా కూతురు.

కూతురు కాపురానికి రాలేదని అత్తని చంపిన అల్లుడు

భార్యని కాపురానికి ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు నాగసాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అత్తింటికి వెళ్లాడు. అత్త-కూతురు-అల్లుడు మధ్య మాటల యుద్ధం ముదిరి, తారాస్థాయికి చేసింది. పట్టరాని కోపంతో కత్తితో అత్తను కత్తితో పొడిచి హత్య చేశాడు అల్లుడు.  కేవలం అత్త వల్లే కూతురు తన వద్దకు రాలేదని భావించాడు.

స్థానికంగా జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడు నాగసాయిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని వివరాలు చెబుతామని అంటున్నారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

ALSO READ: రెండు కార్లు ఢీ.. దంపతులు మృతి, ఎక్కడ?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×