Delhi Metro Station: దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో కేంద్ర బలగాలు అలర్ట్ అయ్యాయి. ప్రతీ ప్రాంతంపై నిఘా వేశాయి. అయినా మెట్రో స్టేషన్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి బ్యాగ్ అక్కడ పెట్టేసి పరుగెత్తాడు. దీన్ని గమనించిన బలగాలు పరుగెత్తి అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. దీంతో షాకయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఢిల్లీలోని జామా మసీదు మెట్రో స్టేషన్‌లో శనివారం ఊహించని ఘటన జరిగింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే కేంద్ర బలగాలు అక్కడ ఉండడంతో భయపడ్డాడు. ఫలితంగా తాను తీసుకొచ్చిన ఓ బ్యాగ్ అక్కడే వదిలేసి స్టేషన్ బయటకు పరుగులు తీశారు. వెంటనే అలర్టయిన బలగాలు, పరుగెత్తి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. అతడి విడిచి పెట్టిన బ్యాగ్ తనిఖీ చేశారు. లోదుస్తులలో దాచి ఉంచిన సుమారు 155 గ్రాముల బంగారానికి సంబంధించి పొడి లభ్యమైంది. దీంతో బలగాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. అదుపులోకి తీసుకున్న సీఆర్ఎస్ఎఫ్ బలగాలు అతడ్ని విచారించారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి పేరు మహ్మద్ షుఐబ్. యూపీలోని ముజఫర్‌నగర్ ప్రాంతానికి చెందినవాడు. మలేషియాలోని ఓ వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు.
పట్టుబడిన బంగారం పొడి మాటేంటి? లోదుస్తుల బంగారం పొడిని దాచిపెట్టాడు. అది మాదక ద్రవ్యం లేదా సైకోట్రోపిక్ పదార్థం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు అధికారులు. అక్టోబర్ 16న బంగారం పొడి తీసుకుని ఢిల్లీకి వచ్చాడు. జామా మసీదు ప్రాంతంలోని ఓ హోటల్‌లో బస చేసినట్లు చెప్పాడు. మరుసటి రోజు లజపత్ నగర్‌కు ప్రయాణించడానికి మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. అయితే కొన్ని సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి.
వెంటనే పోలీసులు కస్టమ్స్ అధికారులను సంప్రదించారు. ఆ విషయం తమ పరిధిలోకి రాదని చెప్పారు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. షుఐబ్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో వెయిట్ అండ్ సీ.
CISF’s Swift Response: Suspicious Person Apprehended While Attempting to Escape at Metro Station!
Alert CISF personnel at Jama Masjid Metro Station of DMRC sprang into action when a passenger attempted to flee after a suspicious, dense object appeared on the XBIS screen during… pic.twitter.com/QTh9AneEdP
— CISF (@CISFHQrs) October 19, 2026