E-Paper
Advertisement

భార్య మరొకరితో.. షాకైన భర్త, పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు

భార్య మరొకరితో..  షాకైన భర్త,  పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు
Advertisement

Tuticorin: అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా వారికి పుట్టిన బిడ్డలకు చిన్న వయస్సులో నూరేళ్లు నిండిపోతున్నాయి. భార్య మరొక వ్యక్తితో వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు ఆమె భర్త. దీన్ని తట్టుకోలేని ఆయన ఇద్దరు పిల్లలకు కరెంటు షాక్ ఇచ్చి చంపాడు. అతడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది.

తమిళనాడులో దారుణం- తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పుదుక్కోట్టై సమీపంలోని సావేరియార్‌పురంలో 40 ఏళ్ల ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత అదే కరెంట్ షాక్‌తో ఆ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

భార్య మరొకటితో పోయిందని మనస్థాపానికి గురైన భర్త- సవేరియార్ ప్రాంతానికి చెందిన మైఖెల్-సబితా రోనికా దంపతులు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురికి 14 ఏళ్లు, 12 ఏళ్ల కుమారుడు  ఉన్నాడు. మైఖెల్ లారీ‌డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పుడప్పుడు డ్రైవర్ పోస్టుకి విరామం ఇచ్చి, పెయింటింగ్ పనులు చేసేవాడు. అయితే సబితా రోనికా గృహణిగా ఉంటోంది.

ఇద్దరు పిల్లలకు విద్యుత్ షాక్ ఇచ్చిన తండ్రి– కొంతకాలంగా భార్య భర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి. చివరకు ఆరు నెలల కిందట సబిత..  భర్త-ఇద్దరు పిల్లలను విడిచి మరొక వ్యక్తితో వెళ్లిపోయింది. పరిస్థితి గమనించిన మైఖెల్.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత డిప్రెషన్‌కు లోనయ్యాడు. భార్య లేని ఈ లోకంలో ఉండకూడదని డిసైడ్ అయ్యాడు.

Advertisement

ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య- తన ఇద్దరు పిల్ల‌ల‌ను చంపేసి తాను చ‌నిపోవాల‌ని భావించాడు. ఈ క్ర‌మంలో శుక్రవారం ఇద్దరు పిల్లలకు ఆహారం తెచ్చి ఇచ్చాడు. తినేసిన తర్వాత నిద్రపోమని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత పిల్లలకు విద్యుత్ తీగలను కట్టి వాటిని విద్యుత్‌కు అనుసంధానించాడు. వారిని చంపిన తర్వాత  అదే తీగతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మైకేల్‌తోపాటు  అతడి తండ్రి ఆంథోనీ ముత్తు గది బయట నిద్రపోతున్నాడు.

ALSO READ: బంకీపూర్ బైపోల్… ప్రశాంత్ కిషోర్ విసుర్లు, భయంతోనే బీజేపీ తప్పుకుందని వ్యాఖ్య

శనివారం మధ్యాహ్నం వరకు తలుపు తాళం వేసి ఉండటంతో ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశాడు మృతుడి తండ్రి. వారు పుదుకోట్టై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తలుపు పగలగొట్టి లోపల చూడగా ముగ్గురు శరీరాలకు విద్యుత్ తీగలు కట్టి ఉన్నాయి. మంచంపై ముగ్గురు విగతజీవులుగా పడి  ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

Related News

నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

Big Stories

Advertisement
×