E-Paper
Advertisement

ఆ వెబ్ సీరిస్ చూసి.. థార్ కారుకు ఏటీఎంను కట్టి దోపిడి, కెమేరాలో రికార్డైన ఘటన

ఆ వెబ్ సీరిస్ చూసి.. థార్ కారుకు ఏటీఎంను కట్టి దోపిడి, కెమేరాలో రికార్డైన ఘటన
Advertisement

ATM Theft: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా తురిగడియా మార్కెట్ ప్రాంతం శుక్రవారం రాత్రి ఒక హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు వేదికైంది. సాధారణంగా దొంగలు తాళాలు పగలగొట్టడమో, లేదా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కట్ చేయడమో మనం చూస్తుంటాం. కానీ ఇక్కడి దొంగలు రూట్ మార్చారు. అర్ధరాత్రి వేళ నిర్మానుష్యంగా ఉన్న ‘ఇండియా వన్’ ఏటీఎం సెంటర్‌ను టార్గెట్ చేసిన దుండగులు.. ఒక పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. టెక్నాలజీని వాడకుండా కేవలం శారీరక బలాన్ని, ఒక శక్తివంతమైన వాహనాన్ని నమ్ముకుని వారు చేసిన పని ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

రోడ్డుపై 200 మీటర్లు ఈడ్చుకెళ్లారు..
ఈ దోపిడీకి దొంగలు ఎంచుకున్న వాహనం ‘మహీంద్రా థార్’ ఎస్‌యూవీ. కారు దిగిన దుండగులు ఏటీఎం కియోస్క్‌లోకి చొరబడి, బలమైన ఇనుప గొలుసు లేదా తాడు సహాయంతో ఏటీఎం మిషన్‌ను థార్ కారు వెనుక భాగానికి గట్టిగా కట్టేశారు. ఆ తర్వాత కారును ఒక్కసారిగా ముందుకు పోనివ్వడంతో, ఆ పవర్‌కు ఏటీఎం మిషన్ పునాదులతో సహా ఊడి బయటకు వచ్చేసింది. అంతటితో ఆగకుండా, ఆ మిషన్‌ను రోడ్డుపై దాదాపు 200 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో మిషన్‌ను పగలగొట్టి, అందులోని భారీ నగదును దోచుకుని క్షణాల వ్యవధిలో అక్కడి నుంచి పరారయ్యారు.

Advertisement

‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ వెబ్ సిరీస్ స్ఫూర్తితోనేనా?
ఈ విచిత్రమైన దొంగతనం తీరు చూస్తుంటే పాపులర్ వెబ్ సిరీస్ ‘Pritam and Pedro’ లోని ఒక కీలకమైన సీన్ గుర్తుకు రాక మానదు. ఆ సిరీస్‌లో కూడా సరిగ్గా ఇలాగే వాహనానికి ఏటీఎంను కట్టి లాగేసే సీన్ ఉంటుంది. దొంగలు ఈ వెబ్ సిరీస్‌ను నిశితంగా గమనించి, అందులోని ఐడియాను సేమ్ టు సేమ్ రియల్ లైఫ్‌లో రీక్రియేట్ చేసినట్లు స్పష్టమవుతోంది. రీల్ లైఫ్ దొంగతనాన్ని రియల్ లైఫ్‌లో అప్లై చేసి, పోలీసులకే సవాల్ విసిరేలా ప్లాన్ అమలు చేయడం గమనార్హం.

రంగంలోకి పోలీసులు.. సీసీటీవీల వేట
శనివారం ఉదయం ఈ ఘోరాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలాసోర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏటీఎం పరిసరాల్లో ఉన్న CCTV ఫుటేజీలను, అలాగే ఆ మార్గంలోని టోల్ గేట్లు, హైవే కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితులు వాడిన థార్ కారు ఎవరిది? వారు ఎటువైపు పారిపోయారు? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సినిమా స్టైల్ ఐడియాతో సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

Advertisement

Also Read: నేను చనిపోయి ఐదేళ్లయింది… కానీ ఇంకా బ్రతికే ఉన్నాను! ఒక అంతుచిక్కని మైండ్-బెండింగ్ మిస్టరీ

Related News

దీన్నే అంటారు రియల్ బిజినెస్ మైండ్ అని.. నెటిజన్లను ఫిదా చేస్తున్న ఢిల్లీ వ్యాపారి వైరల్ వీడియో!

ఒకరు కంటే ఎక్కువ భార్యలుంటే.. ఉద్యోగం ఊస్ట్-పథకాలు కట్, ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు!

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ రూల్స్ తెలుసుకోకుంటే బుకింగ్ కష్టమే

దారుణం.. జ్యోతిష్యుడు చెప్పాడని కన్నకొడుకునే చంపిన తండ్రి.. అసలేం జరిగిందంటే?

పూరి జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం.. జూలై 16 నుంచి అద్భుత ఘట్టం.. 5 కిలోమీటర్ల పరిధిలో నో-ఫ్లయింగ్ జోన్

సుప్రీం కోర్ట్ సీజేఐపై పేపర్లు విసిరి, దుర్భషలాడుతూ.. పిటీషనర్ హంగామా, వీడియో వైరల్

కరూర్ త్యాగాలకు న్యాయం.. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన సీఎం విజయ్

Big Stories

Advertisement
×