E-Paper
Advertisement

ఈ రైల్వే స్టేషన్ల పేర్లు వింటే నవ్వు ఆపుకోలేరు.. ఇంతకీ అవేంటో తెలుసా?

ఈ రైల్వే స్టేషన్ల పేర్లు వింటే నవ్వు ఆపుకోలేరు.. ఇంతకీ అవేంటో తెలుసా?
Advertisement

Unique Indian Railway Station Names: ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వే నెట్ వర్క్ లలో భారతీయ రైల్వే ఒకటి. ఇక్కడి రైల్వే వ్యవస్థలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని రైల్వే స్టేషన్ల పేర్లు చాలా వింతగా ఉంటాయి. కొన్ని స్టేషన్ పేర్లు సులభంగా ఉంటే, మరికొన్ని వింటేనే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకొన్ని పేర్లు నవ్వు తెప్పిస్తాయి. మొదటిసారి చూసే వారికి ఇవి నిజంగానే స్టేషన్ పేర్లేనా అనే సందేహం కలుగుతుంది. అయితే, ఈ పేర్ల వెనుక స్థానిక చరిత్ర, సంస్కృతి, గ్రామాల పేర్లు ఉండటంతో భారతీయ రైల్వే వాటిని మార్చకుండా అలాగే కొనసాగిస్తోంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కాలా బక్రా

ఫన్నీ రైల్వే స్టేషన్లలో పంజాబ్‌ లోని కాలా బక్రా ఒకటి. ఈ పేరు అర్థం నల్ల మేక”. పేరు వినగానే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు స్టేషన్ బోర్డు దగ్గర ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

సాలి, నానా

Advertisement

రాజస్థాన్‌ లోని సాలి, నానా అనే రెండు స్టేషన్లు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఈ పేర్లు కుటుంబ బంధాలను గుర్తు చేస్తాయి. “నేను సాలికి వచ్చాను” అని ఒకరు, “నానాకు చేరుకున్నాను” అని ఇంకొకరు చెప్తే, వినేవాళ్లు ఆశ్చర్యపోతారు.

దివానా

హర్యానాలోని దివానా స్టేషన్ కూడా వినూత్నమైన పేరుతో గుర్తింపు పొందింది. దివానా అంటే ప్రేమ పిచ్చివాడు, వెర్రివాడు అనే అర్థం వస్తుంది. పేరు సరదాగా ఉన్నా, ఇది సాధారణ ప్రయాణికులకు సేవలందించే ప్రశాంతమైన స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

సింగపూర్ రోడ్

Advertisement

ఒడిశాలోని సింగపూర్ రోడ్ స్టేషన్ పేరు వింటే విదేశీ నగరం గుర్తుకు వస్తుంది. కానీ, ఇది మన దేశంలోనే ఉన్న చిన్న రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చిన ప్రయాణికులు సింగపూర్ వచ్చాం అంటూ సరదాగా ఫొటోలు దిగుతుంటారు.

బిల్లీ, భైంసా

ఉత్తరప్రదేశ్‌లో బిల్లీ, భైంసా అనే స్టేషన్లు ఉన్నాయి. బిల్లీ అంటే పిల్లి, భైంసా అంటే బర్రె. ఈ పేర్లు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రయాణికులు కూడా ఈ పేర్లను చూసి నవ్వుకుంటూ ఫొటోలు తీసుకుంటారు.

IB

ఒడిశాలోని IB స్టేషన్ దేశంలోనే అత్యంత చిన్న పేరు కలిగిన రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది. కేవలం రెండు అక్షరాలే ఉండటంతో ఇది ప్రత్యేకంగా నిలిచింది.

వెంకట నరసింహ రాజు వారి పేట

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న వెంకట నరసింహ రాజు వారి పేట స్టేషన్ దేశంలోనే అత్యంత పొడవైన పేర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పేరును పూర్తిగా చదవడం చాలామందికి కష్టంగా ఉంటుంది. అందుకే కొందరు దీనిని వెంకట నరసింహ స్టేషన్ అని పిలుస్తారు.

Read Also: ఈ రైల్వే స్టేషన్లలో ఫుడ్ టేస్ట్ చేసేందుకు క్యూ కట్టేస్తారు.. మీరూ అక్కడ దిగితే తినకుండా అస్సలు వెళ్లొద్దు!

Related News

బస్ డిపోకు వెళ్లాల్సిన పనిలేదు.. మీ కాలనీ నుంచే దసరా స్పెషల్ బస్సులు!

150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!

పిడుగు దెబ్బకు ఇండిగో విమానం డ్యామేజ్.. లక్నోలో సేఫ్‌గా ల్యాండింగ్, ఎలా జరిగింది?

ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!

Big Stories

Advertisement
×