BigTV English

Odisha Teacher Exam Paper Leaked: అత్యాశ అంటే ఇదేనేమో.. అడ్డంగా దొరికిపోయారు..!

Odisha Teacher Exam Paper Leaked: అత్యాశ అంటే ఇదేనేమో.. అడ్డంగా దొరికిపోయారు..!
Odisha Teacher Leaks Question Papers, Uploads Them On Wife's YouTube Channel
Odisha Teacher Exam Paper Leak

Odisha Teacher Exam Paper Leaked: సోషల్ మీడియా ప్రబలంగా ఈ రోజుల్లో ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు రకరకాల మార్గాలకు అవలంభిస్తారు. ఈ క్రమంలో పలువురు తప్పుడు మార్గాలను ఎంచుకున్న సందర్భాలూ లేకపోలేదు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్‌ ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు ఏకంగా ప్రశ్నాపత్రాలనే లీక్ చేశాడు ఓ టీచర్. ఈ క్రమంలో అడ్డంగా దొరికిపోయాడు. మొత్తం ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


ఒడిషాలోని గంజాం జిల్లాలోని రంభ అనే ప్రాంతానికి చెందిన సమీర్ సాహు ప్రశ్నాపత్రాల వ్యవహారంలో నిందితుడు. సమీర్‌కు యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఇన్నోవేషన్స్ లేకుండా ఎన్ని ప్రయోగాలు చేసినా ఫాలోవర్స్ పెరగడం లేదు. యూత్‌ని టార్గెట్ చేసుకుంటే సక్సెస్ కావచ్చని భావించాడు. దీనికి పేపర్ లీకేజ్ కాన్సెప్ట్‌ని ఎంచుకున్నాడు. ఈ ప్లాన్‌ ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ కావచ్చని భావించాడు. సీన్ కట్ చేస్తే.. ఈ క్రమంలో జాజ్‌పూర్‌లోకి ప్రభుత్వం పాఠశాలలో జగన్నాథ్ కర్, ఆయన వైఫ్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

తొలుత ఈ జంట లీక్ చేసిన పేపర్స్‌ని వాళ్ల దగ్గర తీసుకుని తన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు సమీర్. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం నిమిషాల వ్యవధిలో ఒడిషా అంతటా వ్యాపించింది. స్యూల్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ అథారిటీ డైరెక్టర్ భువనేశ్వర్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తీగలాగితే డొంక కదిలింది. మార్చి 30న సమీర్ ఇంటిపై దాడి చేశారు. అక్కడున్న ప్రశ్నప్రత్నాలను స్వాధీనం చేసుకుని సమీర్‌ని అదుపులోకి తీసుకుని తమదైన స్టయిల్‌లో ట్రీట్మెం‌ట్ ఇవ్వడంతో లోగుట్టు బయటపడింది.


Also Read: ఎన్డీయే 4000 సీట్ల మెజార్టీతో గెలుస్తోంది.. వైరల్ అయిన నితీష్ వ్యాఖ్యలు..

సమీర్ ఎడ్యుకేషనల్‌తోపాటు ప్రో ఆన్సర్ అనే ఛానెల్ కూడా వీటిని అప్‌లోడ్ చేసినట్టు తెలిపాడు సమీర్. ఓ టీచర్ దంపతులు ఒకటి నుంచి ఎనిమిది తరగతి వరకు ఎగ్జామ్స్ పేపర్స్‌ లీక్ చేసినట్టు తేలింది. టీచర్ జగన్నాథ్ కర్..  తన భార్య పేరు మీద యూట్యూబ్ ఛానెల్‌ని ఓపెన్ చేసి అందులో పేపర్స్‌ని అప్‌లోడ్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. టీచర్స్‌ దంపతులనూ అదుపులోకి తీసుకున్నారు. లీకైన పేపర్స్‌తోపాటు ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అత్యాశకు పోయి అడ్డంగా బుక్కయ్యారు. ప్రభుత్వం ఉద్యోగం నుంచి టీచర్లను సస్పెండ్ చేశారు పైస్థాయి అధికారులు.

Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×