E-Paper
Advertisement

LPG Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా? ఏ మాత్రం ఆలస్యమైతే.. ఇదిగో నెంబర్ క్షణాల్లో

LPG Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా? ఏ మాత్రం ఆలస్యమైతే.. ఇదిగో నెంబర్ క్షణాల్లో
Advertisement

LPG Cylinder: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీటి ప్రభావం కారణంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. తాజాగా ఆయిల్ కంపెనీలు రైట్ సమయంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ కాకుంటే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి.

గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యమవుతుందా? 

Advertisement

గ్యాస్ కొరతపై కేంద్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ సిలిండర్లు డెలివరీ విషయంలో తొలుత గృహ వినియోగదారుల కచ్చితంగా ప్రయార్టీ ఇవ్వాలని తేల్చి చెప్పింది. దేశంలో గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని పదే పదే కేంద్రం చెబుతోంది. కానీ వినియోగదారులకు బుక్ చేసి నాలుగైదు రోజుల వరకు గ్యాస్ సిలిండెర్ డెలివరీ కావడం లేదు.

దీంతో దేశవ్యాప్తంగా అధికారులు సోదాలు చేపట్టారు. అక్రమంగా స్టోరేజ్ చేసిన గ్యాస్ సిలిండర్లు బయటపడుతున్నాయి.  చాలామంది గ్యాస్ సిలిండర్లను స్టోరేజ్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు తేలింది. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలు  అటువైపు దృష్టి సారించాయి.

Advertisement

ఏ మాత్రం ఆలస్యమైతే.. ఈ నెంబర్ చెస్తే క్షణాల్లో ఇంటి ముందు గ్యాస్

ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచన చేశాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసి రెండున్నర రోజుల్లో సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ చేయాల్సి ఉంటుంది.

చాలామందికి వారం రోజులు అవుతున్నా గ్యాస్ సిలిండర్ సరఫరా కావడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. రీసెంట్‌గా గ్యాస్ ఏజెన్సీలోకి చొరబడి వినియోగదారులు సిలిండర్లు పట్టుకెళ్లిన ఘటన బయటపడ్డాయి. దీంతో నేరుగా ఆయిల్ కంపెనీలు ఫిర్యాదు నెంబర్లను ఏర్పాటు చేశాయి.

ALSO READ: దేశంలో వంటగ్యాస్ కొరత లేదు.. పానిక్ బుకింగ్స్ వద్దు.. కేంద్రం విజ్ఞప్తి!

ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 7718955555 కు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. అటు భారత్ గ్యాస్ కస్టమర్లకు సంబంధించి 1800-22-4344 లేదా 7715012345 టోల్ ఫ్రీ నెంబర్ తోపాటు మరొక నెంబర్ ఇచ్చింది. HP గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నాయి.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×