Best TVs under 50000: ఇంటికి కొత్త కళ తేవాలన్నా,విజువల్ వండర్‌ను ఎంజాయ్ చేయాలన్నా మంచి స్మార్ట్ టీవీ ఉండాల్సిందే. ప్రస్తుత కాలంలో టీవీ అంటే ఓటీటీ యాప్స్, గేమింగ్ , డాల్బీ అట్మాస్ సౌండ్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి. అంతే కాకుండా కాలానుగుణంగా చాలా రకాల ఫీచర్లు కూడా వస్తున్నాయి. వీటిలో బడ్జెట్, మనకు కావాల్సిన ఫీచర్ల ఆధారంగా టీవీ కొనడం మంచిది. ఈ ఏడాది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా రూ.50,000లోపు బడ్జెట్‌లో లభిస్తున్న బెస్ట్ టీవీల లిస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సోని బ్రాండ్ పిక్చర్ క్వాలిటీ, సౌండ్‌కు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. సేల్ సమయంలో ఈ టీవీ.. ధర సుమారు రూ.41,999 వరకు లభిస్తోంది. ఇందులో ఎక్స్-రియాలిటీ ప్రో టెక్నాలజీ ఉండటం వల్ల వీడియోలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. గూగుల్ టీవీ ఓఎస్ సపోర్ట్, డాల్బీ ఆడియో ఫీచర్లు దీని సొంతం. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు కావాలనుకునే.. వారికి ఈ టీవీ బెస్ట్ అని చెప్పొచ్చు.
పెద్ద స్క్రీన్ కోరుకునే.. వారికి శామ్‌సంగ్ క్రిస్టల్ 4K సిరీస్ అద్భుతమైన ఛాయిస్. అమెజాన్ సేల్‌లో.. ఈ 55 ఇంచుల మోడల్ ధర సుమారు రూ.45,999 వరకు ఉంది. ప్యూర్ కలర్ టెక్నాలజీ, HDR 10+ సపోర్ట్ , స్లీక్ డిజైన్ దీని ప్రత్యేకత. తక్కువ బడ్జెట్‌లో పెద్ద సైజ్ స్క్రీన్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.
ఎల్జీ వెబ్‌ఓఎస్ సిస్టమ్‌తో పని చేసే ఈ టీవీ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్‌ను అందిస్తుంది. సేల్ ఆఫర్లలో .. దీని ధర దాదాపు రూ.38,999 గా ఉంది. ఆల్ఫా 5 AI ప్రాసెసర్, గేమింగ్ ఆప్టిమైజర్, అద్భుతమైన కలర్ రీప్రొడక్షన్ దీనిలో లభిస్తాయి. మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ దీనిని మరింత ఈజీగా ఆపరేట్ చేయడానికి సహాయ పడుతుంది.
బడ్జెట్ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే.. వారికి రెడ్‌మి బెస్ట్ చాయిస్. ఈ 55 ఇంచుల 4K టీవీ సేల్ సమయంలో.. కేవలం రూ.34,999 ధరకే లభిస్తోంది. ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్ ఫేస్, డాల్బీ విజన్, HDR10+, 30 వాట్ల పవర్ ఫుల్ స్పీకర్లు దీని ప్రత్యేకత. దీంతో తక్కువ ఖర్చులో..పెద్ద స్క్రీన్ ఫీల్ పొందవచ్చు.
టెక్ మార్కెట్‌లో వేగంగా.. దూసుకుపోతున్న హైయర్ బ్రాండ్ నుంచి ఈ 55 ఇంచుల టీవీ రూ.39,999 ధరలో అందుబాటులో ఉంది. గూగుల్ టీవీ ప్లాట్‌ఫాం, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్, డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. ఫీచర్ల పరంగా ఇది మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.
Also Read: అమెజాన్ సేల్‌లో 3-స్టార్ Vs 5-స్టార్ రిఫ్రిజిరేటర్లు,ఏది కొంటే బెటర్?
ఈ టీవీలను కొనేటప్పుడు.. ఎస్‌బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్/డెబిట్ కార్డులను ఉపయోగిస్తే.. అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే.. కొన్ని మోడళ్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో.. రూ.50,000లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఎంటర్ టైన్‌మెంట్ ఫీల్ పొందాలనుకుంటే.. పైన పేర్కొన్న టీవీలు అద్భుతమైన ఆప్షన్. మీ హాల్ సైజ్ , బడ్జెట్‌కు సరి పోయే టీవీని కొనండి.