Big Stories

Columbia University tension: కొలంబియా వర్సిటీలో టెన్షన్, అదుపులో కొంతమంది..

Columbia university news today(Latest world news): కొలంబియా యూనివర్సిటీలో నిరసనలు అదుపులోకి వచ్చాయా? స్టూడెంట్స్ గదులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారా? నిరసన‌కారులు దాదాపు అదుపులోకి తీసుకున్నట్లేనా? ఇంకా నిరసనకారులు ఉన్నారా? అసలేం జరిగింది. ఈ ఉద్రిక్తతకు కారణమేంటి? క్యాంపస్‌లో ఏం జరుగుతోంది. ఇలా రకరకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

- Advertisement -

గాజాలో ఇజ్రాయెల్ యుద్దం మొదలై చాన్నాళ్లు గడుస్తోంది. ఈ విషయంలో అమెరికా వైఖరిని తప్పుబట్టారు పాలస్తీనా మద్దతుదారులు. ఈ క్రమంలో ఆందోళనకారులు మిన్నంటాయి. చివరకు కొలంబియా యూనివర్సిటీ ముందు బైఠాయించారు. ఆందోళనతో మొదలై చివరకు వర్సిటీలోకి కొన్ని బ్లాకులను ఆక్రమించారు. వర్సిటీ యాజమాన్యం నిరసనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వినకుండా తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.

- Advertisement -

చివరకు క్యాంపస్ యాజమాన్యం పోలీసులను పిలిపించింది. భారీ ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 15 గంటలపాటు హామిల్టన్ హాలులో బైఠాయించిన నిరసనకారులను రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో క్యాంపస్ ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు లోపలకు ఎంట్రీ ఇచ్చి విద్యార్థుల గదులను క్షుణ్నంగా పరిశీలించారు. ఆందోళనకారులు ఎక్కడైనా ఉన్నారా అనేది చెక్ చేశారు. ఇప్పటివరకు దాదాపు 1000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య పెరిగే అవకాముందని తెలుస్తోంది.

ALSO READ: నేడే మేడే.. ఇంతకు మేడే అంటే ఏమిటి..? మేడే ఎప్పట్నుంచి స్టార్టయ్యింది??

నిరసనకారులు క్యాంపస్‌లోకి కొన్ని బిల్డింగులను ఆక్రమించారు. ఈ వ్యవహారంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తడంతో వైట్‌హౌస్ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో క్యాంపస్ నిర్వాహకులు పోలీసులను పిలిపించడం, ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News